Maria Sharapova Confirms Failed Drug Test, Provisionally Suspended

Tennis community stunned by sharapova s failed drug test

ConnectTheDots, Doping, Drug test, Explainer, Maria Sharapova, Meldonium, Sharapova, SportsTracker, Tennis, Tennis Controversies, WADA, What is meldonium, WTA, Tennis latest Tennis news

Maria Sharapova tested positive at the Australian Open for Meldonium, a drug she said she had been taking since 2006 but one that was added to the banned list this year.

డోపింగ్ టెస్టులో అడ్డంగా బుక్ అయిన మరియా షరపోవా..

Posted: 03/08/2016 01:12 PM IST
Tennis community stunned by sharapova s failed drug test

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలకు ముందు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో టెన్నిస్ తార, ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి మారియా షరపోవా అడ్డంగా బుక్ అయ్యింది. ప్రపంచంలో అత్యధిక సంపాదన గల మహిళా అథ్లెట్. అందానికి మారుపేరు. ఆటతీరు, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షరపోవా, తన జీవితంలోనే అతిపెద్ద అపవాదును మూటగట్టుకుంది. దీంతో అమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ వార్తతో అమె అభిమానులు, క్రీడాకారులు, క్రీడా సంఘాలు కూడా విస్మయానికి గురయ్యాయి.

మెల్డోనియం డ్రగ్ను 2006 నుంచి తీసుకుంటున్నట్టు షరపోవా చెప్పింది. అయితే ఈ డ్రగ్ను ఈ ఏడాదే నిషేధించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం.. దీన్ని వాడాలని సూచించిన వైద్యుడికి తెలియదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు షరపోవా నిరాకరించింది. పూర్తి బాధ్యత తనదేని చెప్పింది. షరపోవా ఇటీవల గాయాలతో బాధపడుతోంది.  దీని ప్రభావం ఆమె కెరీర్పైనా పడింది. మెల్డోనియం డ్రగ్ ను  నిషేధిస్తున్నామని వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ) నుంచి అందరు ఆటగాళ్లకు లాగానే షరపోవాకూ ఈ-మెయిల్ అందింది. అయితే, ఆమె దాన్ని చదవలేదని చెబుతోంది. దీంతో అమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆమె వాడిన మెల్డోనియం డ్రగ్ పై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే.. ఈ ఔషధాన్ని వాడిన బాధితుల గుండెకు రక్త ప్రసరణ మరింత సులభతరమవుతుంది. దీంతో శారీరకంగా, మానసికంగా మరింత బలంగా ఉన్నభావన వారికి కలుగుతుంది. దీన్ని తీసుకుంటే శరీరంలో శక్తి నశిస్తున్నా కూడా, తాత్కాలిక ఓపిక పెరుగుతుందన్న కారణంతో ఆటగాళ్లు దీన్ని వాడకుండా నిషేధం విధించారు. జనవరి 1, 2015 నుంచి మెల్డోనియం వాడకంపై నిషేధం మొదలైంది. ఆపై ఎంతో మంది ఆటగాళ్లు డోపింగ్ పరీక్షల్లో విఫలం అయ్యారు కూడా. 2014 వింటర్ ఒలింపిక్స్ లో ఐస్ డ్యాన్సింగ్ విభాగంలో స్వర్ణ పతక విజేత ఎకతెరినా బొబ్రోవా, సైక్లిస్ట్ వర్గోన్వో, 1,500 మీటర్ రన్నర్ అబేబా అరిగావి తదితరులు డోపింగ్ పరీక్షల్లో విఫలమై, తమ కెరీర్ లను ప్రమాదంలో పడేసుకున్నారు.

2001లో డబ్ల్యూటీఏ టూర్లో పాల్గొన్న షరపోవా తక్కువ కాలంలోనే ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది. 2004లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఈ రష్యా బ్యూటీ ఆ మరుసటి ఏడాదే 2005లో 18 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014ల్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలిచింది. గత లండన్ ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గింది. షరపోవా తన కెరీర్లో 4 ఐటీఎఫ్, 35 డబ్ల్యూటీఏ టైటిల్స్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏడో ర్యాంక్లో ఉంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maria Sharapova  meldonium  banned drug  positive doping test  Tennis  

Other Articles