Indian tennis star Sania Mirza on French Open Tournament

French open toughest to win says sania mirza

French Open toughest to win: Sania, French Open, Sania Mirza, Swiss partner Martina Hingis, Qatar Open last week, Elena Vesnina and Daria Kasatkina, Telangana Tourism, Vijay Amritraj-promoted Champions Tennis League, biryani

Indian tennis star Sania Mirza on Wednesday said that French Open is going to be the toughest for her and Swiss partner Martina Hingis as clay court is not among their favourite surfaces.

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పైనే నా దృష్టి: సానియా

Posted: 03/03/2016 03:11 PM IST
French open toughest to win says sania mirza

ఈ ఏడాది మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ గెలవుపైనే తమ దృష్టంతా వుందని టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా అన్నారు. డానికి కృషి చేస్తున్నానని సానియా చెప్పారు. తన స్విస్ భాగస్వామితో కలసి ఈ టైటిల్ ను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేసిన సానియా.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం కొంత శ్రమతో కూడిందని చెప్పుకోచ్చింది. అయితే మూడు గ్రాండ్ స్లమ్ సాధించిన తమకు ఇది కూడా దక్కాలన్న ఆశతో వున్నామని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించేందుకు తమ గతానుభావాలనింటినీ రంగరించాల్సిన అవసరముందని తెలిపిన సానియా.. తాము ఈ టైటిల్ అందుకునేందుకు అన్ని అవకాశాలు పుష్కలంగా వున్నాయని అశాభావం వ్యక్తం చేశారు. అయితే కొంత శ్రమించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే అతని తమ ఫేవరెట్ గ్రౌండ్ పై జరుగుతున్న టోర్నమెంటు కాదని సానియా అభిప్రాయపడ్డారు.

దీంతో పాటు అటు తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని సానియా మీర్జా తెలిపారు. వరంగల్‌ను హైదరాబాద్‌లా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే  పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అటవీ ప్రాంతంలో నాలుగు అరుదైన జాతికి చెందిన పులులు లభ్యమయ్యాయని.. వాటి సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వరంగల్ రామప్ప గుడి, లక్నవరం ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tennis  Sania Mirza  French open  martina hingis  American boats  Telangana  

Other Articles