Padama Bhushan for Saina Nehwal, Sania mirza

Padama bhushan for saina nehwal sania mirza

Sania Mirza, Saina Nehwal, Padma Bhushan, Soprts

Women dominated this year's Padma awards for sports with tennis star Sania Mirza and ace shuttler Saina Nehwal getting the nod for the Padma Bhushan, while archer Deepika Kumari was chosen for the Padma Shri here today. All three were in sublime touch last year and brought the country laurels in their respective sports.

సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు పద్మ భూషణ్

Posted: 01/25/2016 06:04 PM IST
Padama bhushan for saina nehwal sania mirza

క్రీడారంగంలో మన ఆణిముత్యాలు మరోసారి మెరిశాయి. బ్యాడ్మింటన్ లో మన దేశ ప్రతిష్టలను ఎగరవేస్తున్న సైనా నెహ్వాల్ కు అరుదైన ఘనత దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో సైనా నెహ్వాల్ కు పద్మ భూషణ్ రావడం అభినందనీయం.  ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళగా సైనా నెహ్వాల్  అవతరించింది. ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షకుడిగా ఉన్నాడు. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ అవతరించినది.

సానియా మీర్జా సింగిల్, డబుల్స్ లో దూసుకెళుతూ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలు రాసుకుంది. 2003లో ఆమె అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆమెకు 2004లో భారత ప్రభుత్వం అర్జున అవార్డు అందజేసింది. తాజాగా పద్మ భూషణ్ కూడా అందుకోనుంది. 2015లో ఆమెకు ఖేల్ రత్న అవార్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మార్టినా హింగిస్ తో కలిసి సానియా మీర్జా  వరుసగా 6 టైటిళ్లు..29 విజయాలతో దూసుకెళ్లింది. మొత్తానికి క్రీడాలోకానికి మరింత కీర్తి గడించిన సైనా, సానియాలకు పద్మ భూషణ్ లు రావడం మనకు కూడా  గర్వకారణమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Saina Nehwal  Padma Bhushan  Soprts  

Other Articles