World tennis rocked by match-fixing allegations

Match fixing revelations rock tennis

match-fixing Secret files, files exposing match-fixing evidence, world tennis match-fixing, tennis match fixing at the top level of world tennis, including at Wimbledon, can be revealed by the BBC and BuzzFeed News.

A number of investigators have alerted the BBC and BuzzFeed to incidents of match-fixing in the world of professional tennis, even at Wimbledon.

టెన్నీస్ లో మ్యాచ్ ఫిక్సంగ్ ను సహించం

Posted: 01/21/2016 05:46 PM IST
Match fixing revelations rock tennis

టెన్నిస్ క్రీడాభిమానులందరికీ షాకింగ్ లాంటి వార్త. ఎంతో ఇష్టంగా తిలకించే టెన్నిస్ పోటీలు కూడా ఫిక్సింగ్ కుంభకోణం జరిగిందన్నదే ఈ వార్తల సారాంశం. ఒకప్పుడు క్రికెట్, ఒలింపిక్ క్రీడలను కుదిపేసిన ఫిక్సింగ్ భూతం, టెన్నిస్ రంగంలో కూడా తన ప్రభావాన్ని చూపిందని, ఈ కుంభకోణానికి సంబంధించిన సీక్రెట్ ఫైళ్లను, సాక్ష్యాలనూ తాము చూశామని బీబీసీతో పాటు ‘బుజ్ ఫీడ్ న్యూస్’ వెల్లడించింది.

గత దశాబ్ద కాలంలో టాప్-50 ర్యాంకింగ్స్ లో ఉన్నవారు, గ్రాండ్ స్లామ్ విజేతలు కూడా ఈ ఫిక్సింగ్ కుంభకోణంలో అనుమానితులుగా ఉండడం మరింత విస్తుపోయే అంశం. కనీసం 16 మంది క్రీడాకారులు ఈ కుంభకోణంలో ఉన్నారని, వారు మ్యాచ్ లను వదిలేసుకున్న తీరు, మ్యాచ్ లలో గెలిచిన వైనం ఎన్నో ప్రశ్నలను మిగిల్చిందని” బీబీసీ కధనాలు ప్రసారం చేసింది.

నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానున్న సందర్భంలో విడుదలైన ఈ ఫిక్సింగ్ నివేదిక టెన్నిస్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. 2007లో మెన్స్ టెన్నిస్ టూర్ లను పర్యవేక్షించే ఏటీపీ, ఈ విషయమై అదే ఏడాదిలో విచారణ ప్రారంభించి, ఆటగాళ్లకు వ్యతిరేకంగా పలు వివరాలు సేకరించిందని బీబీసీ వెల్లడించింది. రష్యా, ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న బెట్టింగ్ సిండికేట్లు ఒక్కో మ్యాచ్ పై కోట్లను గుమ్మరించి వాటిని ఫిక్స్ చేసేవని తెలిపింది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పోటీల్లో కనీసం 3 మ్యాచ్ లు ఫిక్సింగ్ కు గురైనట్టు తెలుస్తోందని బీబీసీ పేర్కొంది.

వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ లోని ఉన్నతస్థాయి అధికారుల మధ్య అవినీతి జరిగిందని తెలిపింది. “అత్యంత రహస్యమైన ఈ నివేదికలో, మొత్తంగా 28 మంది ఆటగాళ్లకు ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రమేయమున్నట్టు, వారిపై తదుపరి విచారణకు సంబంధించిన వివరాలు మాత్రం లేవని” బీబీసీ వెల్లడించింది. ఈ కథనాలపై మరియు వర్తమాన వార్తా ప్రసార మాధ్యమాల్లో వచ్చిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఏటీపీ చీఫ్ క్రిస్ కెర్మోడ్ వ్యాఖ్యానించారు, మ్యాచ్ ఫిక్సింగ్ లపై ఏమాత్రం ఉపేక్షించమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world tennis  match fixing  secret files  bbc  

Other Articles