Sania Mirza-Martina Hingis notch up record-equalling win

Sania mirza martina hingis notch up record equalling win

sania mirza, sania mirza india, sania mirza tennis, martina hingis, hingis, sania mirza martina hingis, sania hingis, india tennis, tennis india, sydney international, sydney tennis, tennis news, tennis

Sania Mirza and Martina Hingis won 28th consecutive match to equal record set by Gigi Fernandez and Natasha Zvereva in 1994.

మరో రికార్డును నమోదు చేసుకున్న సానియా-హింగీస్

Posted: 01/13/2016 06:28 PM IST
Sania mirza martina hingis notch up record equalling win

టెన్నిస్ మహిళల డబుల్స్ లో సంచలనాలు సృష్టిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో అరుదైన రికార్డును తన పేరున నమోదు చేసుకుంది. తన టెన్నీస్ భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జోడీగా ఏర్పడిన తరువాత రికార్డుల పరంపరను సృష్టిస్తూ.. అదే జోరులో మున్ముందుకు దూసుకుపోతోంది. తాజాగా ఈ జోడీ మరో రికార్డు నమోదు చేసింది. గతేడాది ఓవరాల్గా 10 డబ్ల్యూటీఏ టైటిల్స్ నెగ్గిన సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్లో వరుసగా 28 మ్యాచ్లు గెలిచి అత్యధిక విజయాలు సాధించిన జోడిగా నిలిచారు.

సిడ్నీ ఇంటర్నేషనల్ పోటీలలో భాగంగా బుధవారం జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్లో విజాయాన్ని అస్వాధించిన ఈ జోడీ.. 1994లో నమోదైన రికార్డును సమం చేసింది. మరో మ్యాచ్ లో గెలిస్తే.. ఈ రికార్డును ఈ జోడి తమ పేరును తిరగరాసుకునే అవకాశం కూడా వుంది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో చైనాకు చెందిన చెన్ లియాంగ్, సువాయ్ పెంగ్ జోడిపై 6-2, 6-3 తేడాతో డబుల్స్ నంబర్ వన్ ద్వయం గెలిచింది. సుమారు గంటపాటు జరిగిన మ్యాచ్లో చైనా జోడీపై విజయంతో ఈ ఇండో-స్విస్ ద్వయం సిడ్నీ ఓపెన్‌లో సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయడంతో పాటు ఒకసారి తమ సర్వీస్ నిలబెట్టుకున్నారు. ఈ విజయంతో 1994లో డబుల్స్ ద్వయం గిగి ఫెర్నాండేజ్, నటాషా జ్వెరేవా నెలకొల్పిన వరుస విజయాల రికార్డును సానియా-హింగిస్ సమం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Sydney International tennis  world record  

Other Articles