Roger Federer supports pair of Sania Mirza, Martina Hingis

Federer turns fanboy while watching mirza hingis pair

Roger Federer, Sania Mirza, Martina Hingis, Indo-Swiss pair, International Premier Tennis League (IPTL), UAE Royals, India Aces, Wimbledon, IPTL, UAE Royals, FedEx, tennis news

“Sania-Hingis went on a run...I support them on the women's tour when they play the doubles. I watched the entire Wimbledon final. It was thrilling and I couldn't be happier for them,” said Federer.

సానియా-హింగీస్ జోడీకి మద్దతు పలికిన పెధరర్

Posted: 12/15/2015 05:56 PM IST
Federer turns fanboy while watching mirza hingis pair

సానియా మీర్జా టెన్నిస్ ప్రపంచంలో తన సత్తా చాటడం ప్రారంభించిన తరువాత ఇండియాలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని 17 పర్యాయాలు గ్రాండ్ స్లామ్ లు గెలిచిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం.. ప్రముఖ ప్రపంచ ప్రఖాత అద్బుత టెన్నీస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఐపీటీఎల్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఫెడ్ మీడియాతో మాట్లాడుతూ, తాను 2014లో సానియాతో కలసి మిక్స్ డ్ డబుల్స్ ఆడానని, అప్పటికే ఆమెతో పరిచయం ఉందని, ఆమె ఓ 'స్వీట్ గర్ల్' అని అన్నాడు.

హింగిస్ తో కలసి సానియా వింబుల్డన్ డబుల్స్ ఫైనల్ లో అద్భుత ఆటతీరు కనబరిచిందని ప్రశంసించాడు. తాను వింబుల్డన్ ఫైనల్ మొత్తం మ్యాచ్ ను వీక్షించానని తెలిపాడు. అందకనే తాను ఐపీటీఎల్ మహిళల డబ్బుల్స్ విభాగంలో సానియా-హింగీస్ జోడీకిమద్దతు నిస్తున్నట్ల ప్రకటించాడు. అటు మార్టినా అన్నా తానకు చాలా ఇష్టమని.. తానకు 14 ఏళ్ల వయస్సు నాటి నుంచి అమె ఆటతీరును అభినందిస్తూనే వస్తున్నాని చెప్పాడు. సచిన్ తెండూల్కర్ అన్నా తనకు ఇష్టమని, వీడియోగేమ్ క్రికెట్ ఆడుతుంటే, తన జట్టులో సచిన్ ఉండాల్సిందేనని అన్నాడు. ఇండియాకు రావడం తనకెంతో సంతోషమని వెల్లడించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  Martina Hingis  roger federer  IPTL  

Other Articles