Sania mirza | Mahesh Bhupathi | Leander Paes | Martina Navratilova | Tennis Masters

Sania paes win second exhibition match

Exhibition match, Sania-Bhupathi, IPTL promotion, hyderabad, sania mirza academy, leander paes, bhupathi, martina navratilova, Netaji Indoor Stadium, kolkatta, global Premier Tennis League (IPTL)

This was held as part of the promotion for the International Premier Tennis League being promoted by Mahesh Bhupathi

జోడీ మార్చినా.. మళ్లీ గెలిచింది సానియానే

Posted: 11/27/2015 06:38 PM IST
Sania paes win second exhibition match

ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నీస్ లీగ్ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న టెన్నిస్ మాస్టర్స్. ఎగ్జిబిషన్ మ్యాచ్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో మళ్లీ సానియా మిర్జా జట్టే గెలిచింది. అయితే సానియాతో కోల్ కత్తాలో జతకట్టిన మహేష్ భూపతి ఈ సారి మార్టినా నవ్రతిలోవాతో జతకట్టగా, సానియాతో లియాండ్ పేస్ జతకట్టి విజయాన్ని ఆస్వాదించాడు. తన అనుభవాన్ని పూర్తిగా రంగరించి ఆడిన సానియా రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ లోనూ విజయాన్ని అందుకుంది.

కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్ లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంఛనంగా ప్రారంభిచారు. కాగా తొలి మ్యాచ్‌లో మార్టినా నవ్రతిలోవాలపై 7-5, 7-5 స్కోరుతో నెగ్గిన సానియా జోడీ.. ఈ సారి మహేష్ భూపతి- మార్టినా నవ్రతిలోవాలపై 6-2, 7-6(3) తో విజయాన్ని అందుకుంది. ఈ టెన్నిస్ ప్రమోషన్ లీగ్ కు హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. హైదరాబాద్ లోని సానియా టెన్నీస్ అకాడమీ రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్ కు వేదికగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Exhibition match  Sania-Bhupathi  IPTL promotion  

Other Articles