world tour finals: roger federer floors novak djokovic for semifinal spot

Aggressive federer secures special win

ATP World Tour Finals, Novak Djokovic, Roger Federer, Kei Nishikori, Tomas Berdych, World Tour Finals, London, Tennis, Sport

world tour finals: roger federer floors novak djokovic for semifinal spot

జకోవిచ్ జోరుకు కళ్లెం వేసిన పెధరర్

Posted: 11/19/2015 06:40 PM IST
Aggressive federer secures special win

ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ పై మాజీ నంబర్ వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ విజయాన్ని సాధించాడు. ఈ విజయంతో ఫెదరర్ ఈ టోర్నమెంట్ సెమీస్లో ప్రవేశించాడు. వరుస సెట్లలో 7-5, 6-2 తేడాతో ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్ను మట్టికరిపించాడు. గత ఆగస్టు 23న సిన్సినాటి ఫైనల్స్ తర్వాత ఫెదరర్ చేతిలో జొకోవిచ్ ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి. 45 ఏళ్ల ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ చరిత్రలో వరుసగా 15వ విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గత ఆదివారం ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందిన విషయం అందరికీ విదితమే. అయితే, అతడి జైత్రయాత్రకు స్విస్ మాస్టర్ కళ్లెం వేశాడు.

'ఈ సీజన్లో ఇది చాలా పెద్ద విజయం. ఈ టోర్నమెంట్లో మరింత ముందుకు సాగేందుకు ఈ గెలుపు తోడ్పడుతుంది'అని రోజర్ అభిప్రాయపడ్డాడు. బ్యాక్హ్యాండ్ షాట్లతో ఫెదరర్ మునుపటి జోరు ప్రదర్శించగా, తాను అనవసర తప్పిదాలు చేయడంతో ఓటమి పాలైనట్లు టాప్ ప్లేయర్ జొకోవిచ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా రెండో సెట్లో ఫెదరర్ తన అత్యుత్తమ ఆటను కనబరిచాడని చెప్పాడు. ఈ గెలుపుతో జొకోవిచ్పై తన గెలుపోటముల రికార్డును 22-21గా ఫెదరర్ మెరుగు పరుచుకున్నాడు. తన తదుపరి మ్యాచ్లో జపాన్ ప్లేయర్ నిషికొరితో తలపడనున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles