World Tour Finals: Rohan Bopanna-Florin Mergea confirm semis berth

Bopanna mergea beat murray peers at atp tour finals

atp tour finals, atp finals, atp semi-finals, rohan bopanna, bopanna, Romanian partner, Florin Mergea, Great Britain's Jamie Murray, Australia's John Peers, tennis india, india tennis, tennis news, tennis

Rohan Bopanna-Florin Mergea beat Jamie Murray and Australia's John Peers 6-3, 7-6 (7/5) to secure a semi-finals spot.

ఎటీపీ టూర్ సెమీ ఫైనల్స్ లోకి బొప్పన జోడీ

Posted: 11/18/2015 01:53 PM IST
Bopanna mergea beat murray peers at atp tour finals

ఈ ఏడాది చివరి సిరీస్ గా నిలవనున్న పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జొడి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టూర్ లో పాల్గొంటున్న అందరి కన్న ముందుగా బొప్పాన జోడి సెమీస్ కు చేరింది. రోమేనియా భాగస్వామితో ప్లోరిన్ మెర్జియాతో కలసి బొపన్న సెమీస్ లోకి వెళ్లారు. పురుషుల డబుల్స్ రెండో లీగ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ బోపన్న-మెర్జియా ద్వయం 6-3, 7-6 (7/5) తో నాలుగో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీపై సంచలన విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ లోకి వెళ్లింది

గ్రేట్ బ్రిటెన్ లో జరుగుతున్న ఈ టోర్నీలో స్వదేశానికి చెందిన  నాలుగో సీడ్ జేమీ ముర్రే జోడీని ఓడించి సెమీస్ లోకి వెళ్లడాన్ని అభిమానులు స్వాగతించారు. కాగా, బొపన్న, మెర్జియాలకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో బోపన్న-మెర్జియా ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. గురువారం జరిగే చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో బొలెలీ-ఫాగ్‌నిని (ఇటలీ)లతో బోపన్న-మెర్జియా తలపడతారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atp tour finals  rohan bopanna  Florin Mergea  semi-finals  

Other Articles