iam looking forward to playing with rafael nadal sania mirza

Sania mirza eyes mixed doubles event

Rafael Nadal, Sania Mirza, Mixed Doubles, Doubles Rankings, mixed doubles event, womens doubles event, tennis super star, telangana brand ambassador, martina hingis

tennis womens double number one ranker sania mirza eyes mixed doubles event, says she is looking forward to playing with rafael nadal

మిక్సిడ్ డబ్సుల్ ఈవెంట్ పై కన్నేసిన సానియా మిర్జా..

Posted: 11/04/2015 07:26 PM IST
Sania mirza eyes mixed doubles event

మహిళల డబుల్స్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ.. పోటీ పడిన అన్ని టైటిల్స్ ను తన పేరున రాసుకుంటూ టెన్నీస్ రారాణిగా వెలిగిపోతున్న హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జా కేవలం మహిళల డబుల్స్ తో సరిపెట్టుకోకుండా మరో ముందడుగు వేయాలని భావిస్తుందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. మహిళల డబుల్స్ తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌పై కూడా సానియా మిర్జా కన్నేసినట్లు తెలుస్తోంది. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న సానియా మీర్జా ప్రస్తుతం మిక్స్‌డ్ డబుల్స్‌ విభాగంలో మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్‌తో ఆడాలని ఉన్నట్లు తన మనస్సులోని కోరికను బహిర్గతం చేసింది.

ఈ కోరిక బయట పెట్టడంతో అమె అంతరంగం మిక్సిడ్ డబుల్స్ ఈవెంట్ పైకి కూడా మళ్లిందని టెన్నీస్ అభిమానులు భావిస్తున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రాణించి.. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోందని అభిమానులు పేర్కంటున్నారు. ఒకప్పటి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకును చేజిక్కించుకుంది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఏకంగా పది టైటిళ్లను సాధించి సత్తా చాటింది. ఇటీవలే సింగపూర్‌లో డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గి ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీలను ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rafael Nadal  Sania Mirza  Mixed Doubles  Doubles Rankings  

Other Articles