Sania Mirza-Martina Hingis’ dream run continues, bag ninth title of the year

Sania martina pair lifts wta finals doubles trophy

Sania-Martina pair lifts WTA Finals doubles trophy, sania mirza martina hingis, Garbine Muguruza, Carla Suarez Navarro, WTA Finals doubles trophy, martina hingis sania mirza, martina hingis sania mirza wimbledon, sania mirza us open, tennis news, tennis

The top seeds Sania Mirza-Martina Hingis beat Garbine Muguruza and Carla Suarez Navarro in an hour and seven minutes.

తొమ్మిదవ టైటిల్ ను సోంతం చేసుకున్న సానియా-హింగీస్ జోడి

Posted: 11/01/2015 03:45 PM IST
Sania martina pair lifts wta finals doubles trophy

మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి జోడీ కట్టిన తరువాత అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నభారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మరోసారి అదరగొట్టింది.  సీజన్ ముగింపు టోర్నీ అయిన డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుని తమ జంటకు తిరుగులేదని నిరూపించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సానియా ద్వయం 6-0, 6-3 తేడాతో ఎనిమిదో సీడ్ ముగురుజ్జా-సూరేజ్ నవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించి టైటిల్ ను ముద్దాడింది.  దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్యను తొమ్మిదికి పెంచుకోగా.. ఆ జోడీ ఖాతాలో వరుసగా 22 వ విజయం వచ్చి చేరింది. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కిది 50వ డబుల్స్ టైటిల్ కావడం మరో విశేషం.
 
తొలి సెట్ లో సానియా జోడి వరుస బ్రేక్ పాయింట్లను సాధించి ఆ గేమ్ ను దక్కించుకోగా, రెండో సెట్ లో మాత్రం స్పెయిన్ జంట నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, ఎక్కవ తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఆ సెట్ ను సాధించి మ్యాచ్ విన్నర్ గా అవతరించింది.  వీరిద్దరూ జోడి కట్టిన అనంతరం  పదిసార్లు ఫైనల్స్ కు చేరగా,  ఒక్కసారి మాత్రమే ఓటమి చవిచూశారు. తాజా విజయంతో  ఈ ఏడాది సానియా ఖాతాలో పది టైటిల్స్ చేరాయి. అందులో తొమ్మిది టైటిల్స్ ( డబ్యూటీఏ టూర్ ఫైనల్స్, ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్‌టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించగా... మిగతా ఒకటి (సిడ్నీ ఓపెన్) బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా దక్కించుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles