Sania Mirza and Martina Hingis enter China Open doubles semis

Sania mirza martina hingis enter china open semi finals

Martina Hingis,Sania Mirza,Tennis Sania Mirza-Martina Hingis Enter China Open Semis, Sania Mirza,Martina Hingis, German-Czech pair, Julia Goerges Karolina Pliskova latest Tennis news,

Eyeing their eight title of the season, Indian tennis ace Sania Mirza and her Swiss partner Martina Hingis entered the semi-finals of the China Open here today.

చైనా ఓపెన్ సెమీస్ లోకి సానియా-హింగీస్ జోడీ

Posted: 10/08/2015 08:59 PM IST
Sania mirza martina hingis enter china open semi finals

భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది మరో టైటిల్ వేటలో దూసుకుపోతోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) తో కలిసి చైనా ఓపెన్ డబ్యూటీఏ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ల జోడీ 7-6(5), 6-4 తేడాతో జులియా(జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించి సెమీస్ కు చేరింది. ఒక గంటా 20 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్  ను టై బ్రేక్ ద్వారా దక్కించుకున్న సానియా జోడీ.. రెండో గేమ్ లో మాత్రం దూకుడును కొనసాగించి ఆ సెట్ ను కైవసం చేసుకుంది.
 
ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ లతో సహా ఏడు టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీ ఎనమిదవ టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఒకవేళ ఈ టైటిల్ ను గెలిచినట్లయితే వరుసగా నాల్గో టైటిల్ ను సాధించిన అరుదైన ఘనతను సానియా -హింగిస్ ల జోడీ సొంతం చేసుకుంటుంది. గత మూడు టోర్నమెంట్లలో సానియా జోడీ ఒక్క సెట్ ను కూడా కోల్పోకుండా అత్యత్తమ మెరుగైన ప్రదర్శనతో రాణిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Julia Goerges  China Open  

Other Articles