Sania Mirza-Martina Hingis continue good form, reach Wuhan Open semis

Sania mirza martina hingis in doubles semis of wuhan open

sania mirza, sania, martina hingis, hingis, sania mirza martina hingis, wuhan open, wuhan open tennis, tennis news, tennis, latest tennis news, Wuhan Open news, Wuhan Open, Raquel Kops-Jones, Abigail Spears

Sania Mirza-Martina Hingis eased past the fifth-seeded US combine of Raquel Kops-Jones and Abigail Spears 6-2, 6-2.

వూహన్ ఓపెన్ సెమీస్ లో సానియా జోడి

Posted: 10/01/2015 06:20 PM IST
Sania mirza martina hingis in doubles semis of wuhan open

స్విట్జర్లాండ్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో జోడి కట్టిన అనంతరం భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా వరుస విజయాలను నమోదు చేస్తూ టైటిళ్లను కైవసం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల గ్వాంగ్‌జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టైటిల్ ను గెలిచిన ఈ జోడి.. తాజాగా చైనాలో జరుగుతున్న వూహాన్ ఓపెన్ లో సెమీస్ లోకి  ప్రవేశించింది. ఈ టైటిల్ ను కూడా సొంతం చేసుకునేందుకు సానియా జోడి ఉవ్విళ్లూరుతుంది.

మహిళల డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ గా కోనసాగుతున్న సానియా.. వూహాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ ల జోడి సెమీస్ లోకి దూసుకెళ్లింది. అమెరికా జంట రక్వీల్ కాప్స్-జోన్స్ లను 6-2, 6-2 తేడాతో ఓడించిన సానియా-హింగీస్ జోడి సెమీస్ కు చేరింది.  58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సానియా జోడీ ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు రెండో రౌండ్ లో ఆస్ట్రేలియన్ జంట లౌదియా జాన్స్- ఇగ్నాకిక్ లపై 3-6, 2-6 తేడాతో గెలిచిన సానియా జోడి అదే ఊపును క్వార్టర్స్ లో కూడా కనబరిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Wuhan Open  Raquel Kops-Jones  Abigail Spears  

Other Articles