Sania Mirza-Martina Hingis continue dream run, win Guangzhou Open title

Sania mirza martina hingis win guangzhou open title

Sania Mirza, Martina Hingis, Shilin Xu, Xiaodi You, Guangzhou Open title, martina hingis sania mirza, sania mirza tennis, sania mirza wimbledon, wimbledon sania mirza, latest tennis news

The dominating duo of Sania Mirza-Martina Hingis beat Chinese pair of Shilin Xu-Xiaodi You 6-3, 6-1 to win Guangzhou Open title on Saturday.

సానియా జోడి ఖాతాలో గాంగ్జూ ఓపెన్ మహిళల డబ్సుల్ టైటిల్

Posted: 09/26/2015 06:33 PM IST
Sania mirza martina hingis win guangzhou open title

మార్టినా హింగిస్-సానియా మీర్జా మంచి జోరుమీదున్నారు. ఈ ఏడాది వీరికి అత్యద్భుతంగా కలసివస్తుంది. వీరిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరడంతో వరుస టైటిళ్లను సాధిస్తూ ఈ జోడి దూసుకుపోతోంది. వింబుల్డన్, యూఏస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్న తరువాత, తాజాగా వీరిద్దరూ చైనాలోని గాంగ్జూ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను సోంతం చేసుకున్నారు. గ్యాంగ్‌జూ డబ్ల్యుటిఎ టెన్నిస్ ఫైనల్లో ఈ జోడీ విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచులో ఈ జోడీ 6-3, 6-1 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు షిలిన్ యూ - జూ యూ (చెైనా) జోడీపై గెలిచింది.

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో సానియా జంట 58 నిమిషాల్లోనే తుది పోరు ముగించి మరోసారి తన సత్తాను చాటుకుంది. ఈ టైటిల్‌తో ఈ ఏడాది సానియా ఏడు టైటిల్స్‌ను సాధించింది. ఇందులో ఆరు మార్టినా హింగిస్‌తో కాగా, మరోటి బెతాని మాటెక్ సాండ్స్‌ (అమెరికా)తో కలిసి సాధించింది. ఈ ఏడాది మార్చి నుంచి సానియా, హింగిస్ జోడీ కట్టి అనూహ్యమైన విజయాలు సొంతం చేసుకుంటున్నారు. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిల్స్ కూడా ఈ జోడీ గెలుచుకుంది. మహిళా డబుల్స్‌లో సానియా మీర్జా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Shilin Xu  Xiaodi You  Guangzhou Open title  tennis news  

Other Articles