Roger Federer fan wakes from 11-year coma and is shocked his idol is still top of the world

Federer shock for fan who woke from 11 year coma

Roger Federer fan shocked his idol is still top of the world, roger federer, federer, roger federer news, tennis, tennis news, federer fan, federer coma, Jesus Aparicio

A Roger Federer fan who has awoken from a coma after 11 years has spoken of his shock to see his idol still mixing it with the best tennis players in the world.

రఫ్పా నెంబర్ 2 స్థానంతొ అభిమాని షాక్

Posted: 09/22/2015 06:55 PM IST
Federer shock for fan who woke from 11 year coma

సెలబ్రిటీలు మంచి హైప్ రావడానికి ముఖ్యకారణం వారి అభిమానులే. తమ రంగంలో వారు ప్రదర్శించే మెరుగైన ప్రతిభ వారిని దేశ విదేశాలలో ఎందరెండరో అభిమానులకు రోల్ మోడల్ గా చేస్తుంది. తమ అభిమానుల మనస్సుల్లో గుడి కట్టుకునేలా చేస్తుంది. ఎంతలా అంటే చప్పనలవి కాదు. కొందరు తమ అభిమాన తారలకు గుడి కట్టిస్తే.. మరికోందరు రక్తదానాలు, నేత్రదానాలతో ముందుకెళ్తుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే ఇక్కడా జరిగింది. తమ అభిమాన స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ గురిచి తెలుసుకుని ఓ అభిమాని ఎంతగా పులకించిపోతారో తెలిపే ఘటన స్విట్జర్లాండ్ లో చోటుచేసుకుంది.

2004లో ప్రపంచ టెన్నీస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచిన రోజర్ ఫెదరర్ ఏటీపీ ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచాడు. అదే సంవత్సరం డిసెంబర్ 12న ఫెదరర్ వీరాభిమాని అపారిసియో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. పదకొండేళ్లు కోమాలో ఉన్న అపారిసియో ఈమధ్యే కోలుకున్నాడు. స్పృహలోకి వస్తూనే ఫెదరర్ రిటైర్ అయ్యాడా? అని ప్రశ్నించాడు. లేదు వరల్డ్ నెంబర్ టూగా కొనసాగుతున్నాడని చెప్పగానే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫెదరర్ అద్భుతమైన ఆటగాడని తనకు తెలుసని, అతని సహచరులు ఆండ్రీ అగాసీ, మారట్ సఫిన్, టిమ్ హెన్ మన్ లాంటి టాప్ టెన్ ర్యాంకర్లు రిటైరైపోయినా, ఫెదరర్ టాప్ గానే ఉంటాడని సంబరపడిపోయాడు. ఫెదరర్ 17 గ్రాండ్ స్లామ్ లు గెలుచుకున్నాడని తెలుసుకుని ఉప్పొంగిపోయాడు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : roger federer  federer fan  federer coma  Jesus Aparicio  

Other Articles