US Open: heat pushes retirements to slam record

American jack sock overcome by heat retires from us open

us open, us open 2015, 2015 us open, jack sock, denis istomin retirement, over heat, heat waves rock america, us open news, us open tennis, us open latest news, us open heat, heat in us open, us open temperature, tennis news, tennis

US Open: Temperatures have been over 30 degrees (86 degrees Fahrenheit) all week with humidity hitting 40 percent on Thursday.

యుఎస్ ఓపెన్ లో భానుడు వన్ సైడ్ గేమ్..14 మంది రిటైర్

Posted: 09/04/2015 07:02 PM IST
American jack sock overcome by heat retires from us open

యూఎస్ గ్రాండ్ స్లామ్లో పాల్గోంటున్న క్రీడాకారులకు గ్రీష్ముడు పట్టపగలు చుక్కలు చూపెడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిన ఆటగాళ్ల సంఖ్య ఇప్పటికే 14కు చేరుకుందంటే భానుడి భగభగలు అక్కడ ఎలా వున్నయాయన్నది మనకు ఇట్టే అర్థమవుతుంది. స్వదేశం అమెరికాకు చెందిన జాక్ సాక్ 33 డిగ్రీల ఎండ వేడిమిని తట్టుకోలేక టెన్నిస్ కోర్టులోనే నిస్సహాయంగా కూలబడిపోగా, అతడిని డ్రెస్సింగ్ రూముకు మోసుకెళ్లాల్సి వచ్చిందంటేనే విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

బెల్జియంకు చెందిన రుబెన్ బెమెల్మన్స్తో మ్యాచ్లో 6-4, 6-4, 3-6, 1-2తో ఉన్న దశలో 28వ సీడ్ ఆటగాడైన 22 ఏళ్ల సాక్ రిటైర్ అవ్వాల్సి వచ్చింది. సెట్ విరామాల్లో ఐస్ ముక్కలతో అతడికి సాంత్వన చేస్తూ, చల్లని టవల్స్తో ఉపశమనం కల్గించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నిత్యం శీతలంగా వుంటే ప్రాంతంలో ఒక్కసారిగా 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. జాక్ రిటైరైన కొన్ని గంటల్లోనే ఉజ్బెకిస్తాన్కు చెందిన డెన్నిస్ ఇస్తోమిన్ 6-4, 6-4, 1-0 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన డొమినిక్ తేయిమ్తో ఉన్న సందర్భంలో కోర్టులోనే కుప్పకూలిపోయాడు.దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 14 మంది యూఎస్ ఓపెన్లో ఎండ వేడిమికి తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US open  jack sock  denis istomin retirement  over heat  heat waves rock america  

Other Articles