Sania Mirza said Khel Ratna will encourage and inspire me to do better

Sania mirza said khel ratna will encourage and inspire me to do better

Sania Mirza, Kel ratna, mahesh Boopati, Rajiv Khel ratna, Sports

Indian tennis ace Sania Mirza, who will receive the prestigious Khel Ratna award on 29 August, said on Friday that her former mixed doubles partner Mahesh Bhupathi too is a deserving candidate for the honour and hoped he will receive the recognition in near future.

భూపతి కూడా రత్నమే: సానియా మీర్జా

Posted: 08/29/2015 05:35 PM IST
Sania mirza said khel ratna will encourage and inspire me to do better

ఖేల్ రత్న అందుకోవడం తనలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని సానియా మీర్జా వెల్లడించింది. తనకు ఖేల్ రత్న కోసం ప్రమోట్ చేసిన భారత క్రీడాశాఖకు తన ధన్యవాదాలు తెలిపింది. తన ప్రతిభకు తగిన గుర్తింపుగా భావిస్తున్నానని.. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించేందుకు ఎంతో ఇన్సైరింగ్ గా ఖేల్ రత్న ఉంటుందని సానియా మీర్జా తెలిపింది. తాను దేశం కోసం ఆడానని, అందుకు తగ్గ గుర్తింపుగా భారత ప్రభుత్వం ఖేల్ రత్న పురస్కారాన్ని అందించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని సానియా మీర్జా తెలిపింది. కాగా తానతో పాటు ఆడుతున్న మహేష్ భూపతికి కూడా ఖేల్ రత్న ఇస్తే బాగుంటుందని.. దేశం కోసం ఎంతో బాగా ఆడుతున్నారని, భారత కీర్తి ప్రతిష్టలను పెంచారని స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువచ్చింది.

క్రీడా రంగలో అందజేసే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డును టెన్నీస్ స్టార్ సానియా మిర్జాకు కేంద్రం ఇవాళ అందజేయనుంది. రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకుంటుంది. సానియకు ఖేల్ రత్న ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. దీంతో కర్నాటక హై కోర్టు కేంద్రానికి , సానియాకు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులతో అవార్డు ప్రధానంపై అనుమానాలు తలెత్తాయి.  అయితే నోటీసులందిన మాట నిజమేనని, దాని ప్రభావం అవార్డుల ప్రధానంపై ఉండదని తేల్చి చెప్పింది క్రీడాశాఖ. నోటీసులు అందిన 15 రోజుల లోపు అఫిడవిట్ దాఖలు చేస్తామని అధికారులు తెలపడంతో అవార్డు ప్రధానంపై క్లారీటీ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Kel ratna  mahesh Boopati  Rajiv Khel ratna  Sports  

Other Articles