karnataka high court stay on rajiv gandhi khel ratna to sania mirza

Karnataka hc stays sania mirza s khel ratna award

sania mirza, tennis star, karnataka high court, Girish N gowda, rajiv khel ratna, stay on sania award, rajiv gandhi khel ratna to sania mirza, Paralympic athlete H N Girisha, highest sporting honour

The Karnataka High Court (HC) on Wednesday put a stay on Rajiv Gandhi Khel Ratna to be awarded to tennis ace Sania Mirza after paralympian H Girisha's filed a plea against it.

సానియా మిర్జాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుపై స్టే

Posted: 08/26/2015 04:56 PM IST
Karnataka hc stays sania mirza s khel ratna award

భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు కర్ణాటక హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇటీవల ప్రకటించిన అత్యుతన్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. పారా ఒలింపియన్ గిరీషా ఎన్ గౌడ వేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాల్చింది. అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ మేరకు నోటీసులను జారీ చేసింది. భారత టెన్నిస్ క్రీడాకారులలో లియాండర్ పేస్ తరువాత ఈ అవార్డను అందుకోనున్న రెండో టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా నిలిచింది. సానియా ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోకున్నా.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గత ఏడాది అమె కనబర్చిన ప్రతిభను, ఆ ఆట ద్వారా అమె దేశానికి కందించిన పథకాలను పరిగణలోకి తీసుకున్న అమె పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది.

అంతకుముందు  కేరళ రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి కె బాలి నేతృత్వంలోని అవార్డుల కమిటీ సానియా మిర్జా పేరును కేంద్ర మంత్రిత్వశాఖ రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డు నిమిత్తం సిఫార్సు చేసింది. కాగా, అవార్డుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని గిరీషా కర్ణాటక హైకోర్టు ఆశ్రయించాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నా అవార్డు ఇవ్వలేదని న్యాయస్థానానికి మొర పెట్టుకున్నాడు. తనకు కాదని సానియాకు ఖేల్ రత్న ఇవ్వడాన్ని కోర్టులో సవాల్ చేశాడు. కర్ణాటకకు చెందిన గిరీషా 2012 సమ్మర్ పారా ఒలింపిక్స్ లో హై జంప్ లో వెండి పతకం సాధించాడు. దీంతో పారాఒలింపిక్స్ మెడల్ సాధించిన 9వ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. అంతేకాదు వెండి పతకం సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు కెక్కాడు. 2013లో కేంద్ర ప్రభుత్వం అతడికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  tennis star  karnataka high court  Girish N gowda  

Other Articles