Sania Mirza-Martina Hingis bow out of Rogers Cup

Sania mirza martina hingis lose toronto semi finals

sania mirza, sania mirza india, martina hingis, martina hingis sania mirza, sania mirza martina hingis, sania hingis, rogers cup, rogers cup tennis, tennis news, tennis

Sania Mirza-Martina Hingis lost 3-6 2-6 to Caroline Garcia-Katarina Srebotnik in the last-four match of Rogers Cup.

రోజర్స్ కప్ సెమీప్ లో ఓడిన సానియా జోడి

Posted: 08/16/2015 09:20 PM IST
Sania mirza martina hingis lose toronto semi finals

భారత క్రీడాకారులు ఇవాళ అచ్చిరాలేదు. నిన్న సంచలనాలకు తెరలేపిన బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా ఇవాళ ఓటమిపాలైంది. నిన్న టొరంటో వేదికగా జరుగుతున్న రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ లోకి
అడుగుపెట్టిన సానియా మిర్జా జోడి ఇవాళ పరాజయాన్ని చవిచూసింది. టొరంటోలో జరిగిన మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడి 6-3, 6-2 తేడాతో కరోలైన్ గార్సియా-క్యాథరినా ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది.
భారత్-స్విస్ జంటను ఓడించిన కరోలైన్-క్యాథరినా జోడి ఫైనల్ లోకి దూసుకెళ్లింది.

సానియా మిర్జా- మార్టినా హింగీస్ జోడి మొదటి సెట్లో రెండు డబుల్ ఫాల్ట్స్ చేశారు. ఆ తర్వాత మూడు అవకాశాలు వచ్చినా వాటిని చేజార్చుకున్నారు. రెండు బ్రేక్ పాయింట్లను సాధించి కరోలైన్-క్యాథరినా ద్వయం తొలి సెట్ కైవసం చేసుకుంది.రెండో సెట్లోనూ సానియా జంట డబుల్ ఫాల్ట్స్, అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. దీంతో కెనడా ఓపెన్ టోర్నమెంట్లో వీరి పోరు సెమీస్ లోనే ముగిసి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. మ్యాచ్ లో మొత్తం 54 పాయింట్లు సాధించి సెమీస్ గెలిచి కరోలైన్-క్యాథరినా ఫైనల్లోకి ప్రవేశించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  Tennis  Rogers Cup  semi finals  

Other Articles