Sania Mirza to be Given Rajiv Gandhi Khel Ratna Award

Tennis ace sania mirza to be awarded rajiv gandhi khel ratna

Sania Mirza to be awarded Khel Ratna, Sania Mirza recommended for Rajiv Gandhi Khel Ratna by sports ministry, tennis star sania mirza, Rajiv Gandhi Khel Ratna, Sania Mirza, Sania Mirza Khel Ratna, Khel Ratna award, Sania Mirza for Khel Ratna award, sports ministry, Vikas Gowda, Sardar Singh, Sania Mirza, Rajiv Gandhi Khel Ratna, Martina Hingis, AITA, Wimbledon, tennis news

Sania Mirza has been awarded the coveted Rajiv Gandhi Khel Ratna award by the Union sports ministry

సానియాకు ఖేల్ రత్నా పురస్కారం.. కేంద్రం అమోదం..

Posted: 08/11/2015 04:33 PM IST
Tennis ace sania mirza to be awarded rajiv gandhi khel ratna

హైదరాబాద్ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు దేశంలోని క్రీడాకారులకు లభించే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నా అవార్డునందించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. మంగళవారం కేంద్ర ఈ పురస్కారాన్ని సానియామిర్జాకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సానియాకు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందించాలని క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్రానికి ప్రతిపాదించడంతో.. ఈ వరసలో ఎంతో మంది క్రీడాకారులు వున్నా వారిని తోసిరాజని సానియాను ఈ పురస్కారం వరించింది.

క్రీడా రంగంలో అధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సానియా నిలవడంతో ఆమె పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర క్రీడా శాఖ కేంద్రానికి సిఫార్సు చేసిన దరిమిలా కేంద్రం ఈ మేరకు అమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సానియా ఇటీవలే మార్టినా హింగిస్ తో జతకట్టి వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే అమె ఇటీవల సాధించిన వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ ను పరిగణలోకి తీసుకోకుండానే అమెను రాజీవ్ ఖేల్ రత్నా అవార్డుకు ప్రకటించింది.

2014 ఏసియన్ గేమ్స్‌, యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని టెన్నిస్ రంగంలో నలుదిశలా ఇనుమడింప జేసినందుకు గాను సానియాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కనుంది. సానియా మిర్జాకు 2004లో అర్జున అవార్డును అందుకోగా, 2006లో పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బహుకరించింది. అయితే ఈ సారి సానియా మిర్జాతో పాటు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు 11 మంది పోటీ పడ్డారు. ఈ పోటీలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు ఉన్నా వారందరినీ వెనక్కనెట్టి సానియా ఈ అవార్డను అందుకోగలిగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Rajiv Gandhi Khel Ratna  tennis star  AITA  Wimbledon  tennis news  

Other Articles