Sania-Hingis pair creates history at the Wimbledon

Sania mirza scripts history at the wimbledon

Sania Mirza scripts history at the Wimbledon, Sania Mirza and Martina Hingis wins wimbledon 2015 title, Sania Mirza, Tennis, Martina Hingis, Grand Slam Tennis, Wimbledon Tennis, Sania Mirza, Martina Hingis, Tennis, telangana brand ambassador, Wimbledon, Wimbledon 2015, Tennis, Women's Doubles event

Indian ace tennis star Sania Mirza has created history at the Wimbledon as she won the Women's Doubles event along with her partner Martina Hingis.

వింబుల్డన్ లో చరిత్రను సృష్టించిన సానియా-హింగీస్ జోడి..

Posted: 07/12/2015 12:38 PM IST
Sania mirza scripts history at the wimbledon

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలిసారిగా వింబుల్డన్ చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ఈ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన అమె అదే జోరులో.. హుషారుగా టైటిల్ ను సొంతం చేసుకున్నారు.  వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలోకి దూసుకెళ్లిన సానియా జోడి టైటిల్ ను కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ టైటిల్ రేసులో తన స్విట్జార్లాండ్ పార్ట్ నర్ మార్టినా హింగీస్ తో కలసి టైటిల్ ను దక్కించుకుంది. హింగీస్ తో కలసి ఇటీవల పలు విజాయాలను నమోదు చేసుకున్న సానియా.. తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ ను సొంతం చేసుకుని తన ఆనంధాన్ని వ్యక్తం చేసింది.

ఇవాళ జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్స్ లో రష్యాకు చెందిన ఎకటెరినీ మకరోవా, ఎలినా వెస్నినా జోడిని సానియా జోడీ ధీటుగా ఎదుర్కోంగి. తొలి సెట్ లో ఓటమిని చవిచూసిన సానియా జోడి.. రెండో సెట్ పైచేయిని సాధించింది. మూడో సెట్ లో కూడా అత్యద్భుతంగా రాణించడంతో టైటిల్ ను కైవసం చేసుకుంది. తొలి సెట్ లో ఓటమి నేపథ్యంలో.. రెండో సెట్ నువ్వా నేనా అన్నట్లుగా సాగినా.. చివరకు సానియా జోడీనే విజయం వరించింది. ఆద్యంతం ఉత్కంఠభరింతంగా సాగిన ఈ పో రులో మూడో సెట్ కూడా హై టెన్షన్ మద్యే సాగినా.. సానియా జోడి మెరుగైన ఆటతీరుతో రాణించడంతో విజయం వరించింది. వింబుల్డన్ లో విజయాన్ని నమోదు చేసుకున్న సానియా మిర్జాకు భారత్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Wimbeldon 2015  Martina Hingis  Women's Doubles event  

Other Articles