Paes hingis win australian open mixed doubles title

Paes-Hingis win Australian Open, australia open mixed doubles title, India tennis legend Leander Paes, Swiss tennis player Martina Hingis, Paes-Martina win mixed doubles title, Paes 15th Grand Slam title, Leander Paes, Martina, Australian Open mixed doubles, 15th Grand Slam, Daniel Nestor, Kristina Mladenovic

India's Leander Paes and Swiss Martina Hingis turned back the clock to post a sensational win in the Australian Open mixed-doubles final and improve their respective Grand Slam count to 15, in Melbourne on Sunday.

అస్ట్రేలియా ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ విజేత పేస్, మార్టీనా

Posted: 02/01/2015 01:37 PM IST
Paes hingis win australian open mixed doubles title

అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్సిడ్ డబుల్స్ ఈవెంట్ లో ఇండియన్ టెన్నీస్ లెజెండ్ లియాండర్ పేస్ మరోసారి తన అద్భుతమైన ప్రతిభను కనబర్చి, మెరుగైన ఆటతీరుతో టైటిల్ సాధించారు. మిక్సిడ్ డబుల్స్  లో ఉత్తమ జోడిగా లియాండర్ పేస్ మార్టినా హింగిస్ జోడి అనుకున్నట్లుగానే విజయతీరాలకు చేరింది. ఈ జోడి తమ ఖాతాలోకి 15వ గ్రాండ్ స్లామ్ ను సాధించి మరో మైలు రాయిని అధిగమించింది. టెన్నిస్ ప్రపంచంలో ఏడవ సీడ్ లో వున్న లియాండర్ పేస్, మార్టినా హింగీస్ జోడి మూడవ సీడ్ లోని డానియల్ నెస్టర్, క్రిస్టినా మ్లాడెనోవిక్ జోడినిపై 6-4, 6-3 తేడాతో విజయం సాధించారు.

సుమారు గంట రెండు నిమిషాల పాటు శ్రమపడిన జోడి ప్రత్యర్థులను ఓడించి అస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ మిక్సిడ్ టైటిల్ ను సోంతం చేసుకుంది. 41 ఏళ్ల పేస్ ఎనిమిది పురుషుల డబుల్స్, ఏడు మిక్స్డ్ డబుల్స్ ను తన కెరీర్లో సాధించాడు. కాగా మార్టినా హింగిస్ ఇదివరకు రెండు సార్లు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లి ఆటలో చేరి  11వ గ్రాండ్ స్లామ్ ను సాధించింది.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian Open  Martina Hingis  Leander Paes  

Other Articles