Shoaib malik sania mirza marriage divorce latest update

shoaib malik sania mirza divorce, shoaib malik on sania mirza, shoaib malik latest updates, shoaib malik sania mirza divorce updates, sania mirza on shoaib malik, sania mirza marriage problems, sania mirza latest matches updates, latest sports news updates

shoaib malik sania mirza marriage divorce latest update : shoaib malik responds on rumors about his divorce with sania mirza quashes all rumors and says they both still leads happy life

సానియాతో జీవితంపై ఘాటుగా స్పందించిన షోయబ్

Posted: 12/19/2014 11:01 AM IST
Shoaib malik sania mirza marriage divorce latest update

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా- పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులపై కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరి మద్య ఎడబాటు పెరిగిందనీ.., త్వరలోనే విడాకులు తప్పవని గుసగుసలు వచ్చాయి. దీనికి ఇటీవల జరిగిన పలు సంఘటనలు కూడా కలిసి రావటంతో విడిపోవటం తద్యమని విశ్లేషకులు కూడా భావించారు. రోజూ గ్రౌండ్ లో ప్రాక్టీస్ కు బదులు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తున్నా రెండు వైపుల నుంచి స్పందన రాలేదు. ఎవరూ వారిని వెళ్ళి నేరుగా అడిగే ధైర్యం చేయలేదు.

కాని పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాలంటే బయటకు రాక తప్పదని మీడియా షోయబ్ మీడియా ముందుకు వచ్చాడు. విడాకుల వార్తలపై ఘాటుగా స్పందించాడు. ‘మీకు ఇలాంటి పుకార్లను ఎవరు అందిస్తున్నారు’ అని ప్రశ్నించారు. విడాకుల రూమర్లపై మాట్లాడిన పాక్ క్రికెటర్ ‘ఇప్పటికీ మేము ఇద్దరము దుబాయ్ లో కలిసే ఉన్నాము. వీలైనంత ఎక్కువ సమయం కలిసి ఉండేందుకు ఇష్టపడుతున్నాము. అయితే ప్రొఫెషనల్ క్రీడాకారులం కావటం వల్ల మాకు ఉన్న బాద్యతలు, ఒప్పందాలను నిర్వర్తించక తప్పదు. అంతమాత్రానికే వివాహ బంధం విడిపోయినట్లు భావిస్తే సరికాదు’ అని పాక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

కొద్దికాలంగా సానియా షోయబ్ దూరంగా ఉంటున్నారు. ఆటలు, వరుస కాంపిటిషన్ల వల్ల వీరిద్దరూ కలవటానికి సమయం ఉండటం లేదు. అయితే ఒకే ప్రాంతంలో ఉన్న సమయంలో.. ఖాళీగా ఉన్నపుడు కూడా ఎక్కువగా కలుసుకోకపోవటంతో ఇద్దరూ విడిపోతారని ప్రచారం జరిగింది. దీన్ని ఖండించకపోవటంతో ఊహాగానాలు మరీ ఎక్కువయ్యాయి. కానీ షోయబ్ క్లారిటీ ఇవ్వటంతో అంతా అబద్దమని తేలింది. అయితే ఇది ఎప్పటివరకు అబద్దంగా ఉంటుందో చూద్దామని కూడా కొందరు అంటున్నారు. వారికి ఈ జంట విడిపోవటంపై ఉన్న అంత గట్టి నమ్మకం ఏమిటో త్వరలోనే తెలియనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles