Us open starts today night

us open, grand slam, world cup, roger federer, djokovic, andy murray, mixed doubles, singles, wimbledon, sports news, latest news, america

us open starting today in america : roger federer djokovic andy murray will be hot favourites in us open starting today

ఓపెన్ యుద్ధానికి అమెరికా సిద్ధం

Posted: 08/25/2014 10:40 AM IST
Us open starts today night

ఓపెన్ యుద్ధానికి అమెరికా సిద్దమైంది. ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూఎస్ ఓపెన్ 2014 కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. టైటిల్ కోస హేమా హేమీలు నువ్వా.., నేనా అన్నట్లు పోటికి సిద్దమవుతున్నారు. వారం రోజుల పాటు కన్నుల పండువగా.., ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్ ల కోసం అభిమానులు టికెట్లు బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నా రోజర్ ఫెదరర్, జకోవిచ్, ముర్రే, వావ్రింకా, సొంగా వీరిపైనే అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి ఉంది. ముందుగా ఫెదరర్ ను తీసుకుంటే 17 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు, అందులో వరుసగా 5 యూఎస్ ఓపెన్లు. ఇది చాలు అతడి ట్రాక్ రికార్డు ఎలా ఉంటుందో చెప్పడానికి. ఈ మద్య కాస్త ప్రభావం తగ్గిన ఫెదరర్ మళ్ళి తనకు అచ్చొచ్చిన అమెరికాపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. గత ఊపు ప్రదర్శిస్తే మాత్రం ఫెదరర్ కు ఫైనల్ వరకు తిరుగుండదు.

ఇక సెర్బియా మెన్ నోవాక్ జకోవిచ్. మేటి ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న జకోవిచ్ కూడా ఈ మద్య కాస్త దూకుడు తగ్గించాడు. అటు ఆండీ ముర్రే కూడా ఇదే పంధాలో ఉన్నాడు. దిగ్గజాలు దిగదుడుపు అవుతుండటంతో వావ్రింకా, సాంగో వంటి కొత్త రత్నాలు బయటకు వస్తున్నారు. వీరు కూడా హేమాహేమిలకు గట్టి పోటి ఇస్తున్నారు. మరి ఈ సారి టైటిల్ ఫెదరర్ ను వరిస్తుందా లేక మరొకరి సొంతం అవుతుందా చూడాలి.

గ్లామర్ ఆటగా పేరొందిన టెన్నిస్ లో మహిళల గురించి చూసుకుంటే ముందుగా చెప్పాల్సింది సెరినా విలియమ్స్.., మరియా షరపోవా. ఇద్దరూ ఇద్దరే వీరితో పాటు పెట్రా, సిమోనా ఇలా ఎందరో ఉన్నారు. ఆట, అందం రెండు కలగలిపి ఉండే పొట్టి గౌనులను చూసేందుకు ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఇక భారత్ నుంచి తీసుకుంటే.., కేవలం ముగ్గురు మాత్రమే యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ సింగిల్స్ కు వెళ్ళారు. యూకి బాంబ్రి, సోమ్ దేవ్ దేవరామన్, సనమ్ సింగ్ ముగ్గురు మెన్స్ సింగిల్స్ క్వాలిఫైయింగ్ కు ఎంపికయ్యారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us open  sports news  roger federer  djokovic  

Other Articles