శరన్నవరాత్రులు రెండో రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి రూపం | Kanaka Durgamma Devi as bala tripura sundari devi saranavaratrulu

Kanaka durgamma devi as bala tripura sundari devi

Godess Kanaka Durgamma Devi as bala tripura sundari devi, second day of Durga Sarannavaratrulu, bala tripura sundari devi history, Navaratri 2nd day Brahmacharini Balatripurasundari

Godess Kanaka Durgamma Devi as bala tripura sundari devi on second day of Sarannavaratrulu

శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

Posted: 10/01/2016 09:18 PM IST
Kanaka durgamma devi as bala tripura sundari devi

శరన్నవరాత్రి ఉత్సవములలో రెండవ రోజు కనకదుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి. అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది.

శ్రీశక్తి కౌమారి రూపం బాల- అమ్మవారి మూడు రూపాలలో కనిపిస్తుంది. ఒకటి బాల త్రిపుర సుందరి, రెండు లలితా త్రిపుర సుందరి(యవ్వనం), మూడు త్రిపురభైరవి(వృద్ధ రూపం). బాల త్రిగుణైక శక్తి-సరస్వతి విజ్నానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యంతో కూడుకుంది. బల ఆనందప్రదాయిని, బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనసు, బుద్ధి, అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మన వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. షోడస విద్యకు ఈమె అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.

మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీ చక్రంలో ప్రధమాన్నయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి క్రొత్త బట్టలు పెట్టాలి.

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. త్రిశతీ పారాయణ చేసి అమ్మవారికి పాయసము నివేదన చెయ్యలి.


బాలా స్తుతి

ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ
మాయా మాయా స్వరూపీ స్ఫటికమణిమయీ మాతంగీ షడంగీ
ఙ్ఞానీ ఙ్ఞానస్వరూపీ నళిన పరిమళీ నాద ఓంకార యోగీ
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే

బాలా మన్త్రే కటాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ
వ్యాళీ యఙ్ఞోపవీతే వికట కటి తటీ వీరశక్తీ ప్రసాదీ
బాలే బాలేన్దుమౌళే మదగజభుజహస్తాభిషేక్త్రీ స్వతన్త్రీ
కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే

మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ
హరాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా
వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ వీరతన్త్రీ భవానీ
శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తేద్య శ్రీం సౌః నమస్తే

ఐం క్లీం సౌః సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా
శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యైః దినకర కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే
హ్రీం మ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే
క్షాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే

* * *

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం

కదంబవన చారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబనీసేవితాం
నవాంబురుహలోచనాం అభినంబుదశ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణిం ముఖసముల్లసద్వాసినీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం శిలయా

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికకన్యకాం మధురభాషిణీమాశ్రయే

స్మరేత్ర్పథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిఘూర్ణనేత్రాంచలాం
ఘన స్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షేణాం శరచాప పాశాంకుశాం
ఆశేషజనమోహినీ మరుణ మాల్యభూషాంబరాం
జపాకుసుమభసురాం జపవిదౌస్మరేదంబికం

పురందరపురంధ్రికాచికురబంధ సైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతాం
ముకుంద రమణీమణీల సదలంక్రీయాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం...

శ్రీబాల అందరినీ ఆశీర్వదించుగాక...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godess Kanaka Durgamma Devi  Day 2  bala tripura sundari devi  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more