Srikrishna | Janmastami | Lord Krishna

Janmashtami is celebrated with pomp and gaiety by hindus

Srikrishna, Janmastami, Lord Krishna, SriKrishna Janmastami

Janmashtami is celebrated with pomp and gaiety by Hindus all over India, to commemorate the birth of Lord Krishna. Also referred to as Krishnashtami, the festival falls on Rohini nakshatra of Savana month. The celebration revolves around the story of the birth of Lord Krishna.

కృష్ణం వందే జగద్గురుం... జన్మాష్టమి

Posted: 09/04/2015 04:36 PM IST
Janmashtami is celebrated with pomp and gaiety by hindus

సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమ,శ్రీకృష్ణ జయంతి అని రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు.

పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.

                                                      మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే
                                                                   'శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే
అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.



శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం..
* ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. "కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి" అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.
* కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సెగలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోయేవి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.
కృష్ణ లీలలకు అంతేముంది? ఎవరైనా, ఎన్నయినా తలచుకోవచ్చు.

కృష్ణ పరమాత్మ అంటే అపరితమైన ఆనందం. ఇంత అని కొలవడానికి అవకాశం లేనిది. దేన్నైతే పొందాక ఇక మరొకటి కావాలని అనిపించదో అదే అపరిమిత ఆనందం అంటే. శ్రీమద్భాగవతంలో "దేవకీ పూర్వ సంధ్యాయాం అవిర్భూతం మహాత్మనం" అని చెబుతారు. పరమాత్మ దేవకీదేవికి పుట్టాడు అని చెబుతారు. ఆయన అవతరించాడు అని చెప్పరు, అవతరించాడు అంటే ఆయన ఎక్కడి నుండో దిగి రావడం. నేను పుడతాను అని మాట ఇచ్చాడు దేవకీదేవికి. ఆయన తన మాటకే కాదు తన భక్తుల మాటని కూడా తప్పు కానివ్వడు. నృసింహ అవతారం వచ్చింది ప్రహ్లాదుని మాటని నిజం చేయడానికే కదా. అట్లా పుట్టాడు స్వామి. ఆయన పుట్టగానే ఎట్లా ఉన్నాడు అని సేవించిన వసుదేవుని మాట, ఆయన అవతారాన్ని వర్ణించిన వ్యాసుని మాట "తమద్భుతం బాలకం". ఇతను పరమాత్మే అని గుర్తించడానికి పుండరీకాక్షుడై, నాలుడు భుజములు కలిగి, శంఖచక్రగద ధారియై, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కలిగి, కౌస్తుభమణి ధరించి ఉన్నాడు. అట్లాంటి స్వామిని వసుదేవుడు చూసాడు. కారాగారంలో అర్దరాత్రి దేవకీ వసుదేవులకు పుట్టాడు. కంసునికి తెలిస్తే ఏం చేస్తాడో అని దేవకీదేవి చేసిన ప్రార్థనకి తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతరం శ్రీకృష్ణ అవతారం. అనంత కోటి బ్రహ్మాండములని తన పొట్టలో దాచుకున్న స్వామిని మనం కట్టి వేయగలామా! కానీ ఆయన యశోదమ్మ ప్రేమకు కట్టించుకొని తన సౌశీల్యాన్ని చూపించాడు. అట్లాంటి స్వామిని మనం సేవించుకోగలిగే అవకాశం స్వామి మనకు ప్రసాదించడమే మన అదృష్టం.


అబద్దాలు చెప్పినవానికి
చెప్పించినవానికి
మనిషిలో దానవుడిని దండించినవానికి
దానవుడిలో మానవుడిని సృష్టించినవానికి
ధర్మాధర్మాలను
సత్యా సత్యాలనూ
నిత్యా నిత్యాలనూ
కృత్యా కృత్యాలనూ `ఎరుక' పరచుకొని
వాటి నిజరూపాలను చూసే `దారి' చూపించినవానికి
`పుట్టుక చెరసాల' చెరనుంచి
బయటపడే దారి చూపించినవానికి
దుఃఖాల నరకాలలో ఏడవకుండా
సుఖాల మోసాలలో చెరపడకుండా
బయటపడే దారి స్వరపరచిన వాడవయిన
ఓ కృష్ణా నీకు శతకోటి వందనాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikrishna  Janmastami  Lord Krishna  SriKrishna Janmastami  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more