రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. ఇతను ఎంతటి బలవంతుడటంటే.. 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు.. అతనిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు.
రావణుడు అనుకున్నట్లుగానే అతనితో యుద్ధానికి దిగుతాడు. మాంధాత, ఇతనికి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. మాంధాతను ఎలాగైనా ఓడించాలనే కసితో తాను ముందుగానే ఏర్పరుచుకున్న పథకాలను ప్రయత్నించసాగాడు కానీ.. అతని బలం ముందు అవి ఏమాత్రం పనిచేయవు. ఎన్నిరకాలుగా ప్రయత్నించిన రావణుడు అతనిని ఓడించలేకపోయాడు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండానే అతనితో అలాగే పోరాడుతాడు. చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓడిపోతాడు. అప్పుడు అతని బలమెంతో తెలుసుకున్న రావణుడు.. తనని ఓడించడం కష్టమని తెలుసుకుంటాడు. అయితే.. ఇంతలోనే బ్రహ్మ, ఇంద్రుడు జోక్యంచేసుకుని... మంధాత, రావణునికీ మధ్య సంధి కుదుర్చుతారు. దాంతో ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు. ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు, అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి... Read more
Jul 03 | అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి... Read more
Jun 14 | పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు. 1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)3. శ్రుతకర్ముడు - (అర్జునుని... Read more
Jun 10 | సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో... Read more
Feb 17 | మొదటి అధ్యాయము : ఈ జగత్తులో సృష్టి లయానికి కారకుడు, దానికి వ్యతిరేకుడు ఎవరో, ఈ సమస్త జగత్తుకు కర్త ఎవరో, తన సొంత సిద్ధ జ్ఞానముతో విరాజిల్లువాడు ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానాన్ని... Read more