బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారు | special article on bakrid Festival

Special article on bakrid festival

Bakrid Festival, Bakrid Festival special article, Why Muslims celebrate Bakrid, Bakrid History, Bakrid festival other names, Bakrid Festival 2016, Bakrid Festival in India

Special Article on Bakrid Festival.

త్యాగానికి ప్రతీక.. బక్రీద్ పర్వదినం

Posted: 09/13/2016 10:17 AM IST
Special article on bakrid festival

ఇస్లాం జరుపుకునే పండుగల్లో ఒకటి బక్రీద్. దీనికి ఈద్ అల్-అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ అని కూడా పేర్కొంటారు. త్యాగానికి ప్రతీకగా వ్యవహారించబడే ఈ పండగను మూడు రోజులపాటు జరుపుకుంటారు. రంజాన్ పర్వదినం ముగిసిన 70 రోజుల తరువాత ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ రోజున బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు.

ఇక ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు.

బక్రీద్ ఎందుకు:
అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం (సొ.అ.స) తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.
 ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్.[1] (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ (రంజాన్) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు ఖుద్భా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.

ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు చేస్తూ బక్రీద్ ను జరుపుకుంటారు.

అల్లాహ్ పేరున    بسم الله
మరియు అల్లాహ్ మహాశక్తిమంతుడు    والله أكبر
ఓ అల్లాహ్, సత్యముగా ఇది నీనుండే మరియు నీ కొరకే    اللهم إن هذا منك ولك
ఓ అల్లాహ్ నా నుండి స్వీకరించు    اللهم تقبل مني

ప్రతి సంవత్సరం ఈదుల్ అజ్ హా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో రెండు గ్రెగేరియన్ కేలండర్ దినములలో సంభవిస్తుంది, దీని కారణం అంతర్జాతీయ దినరేఖ ననుసరించి వివిధ ప్రాంతాలలో చంద్రవంక వేర్వేరు దినాలలో కానరావడమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Muslim Festival  Bakrid  History  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more