వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటే... జీవితంలో ప్రతిక్షణం మంచి సంఘటనలు ఎదురవుతాయి. ఎటువంటి ఆపదలు, సమస్యలు, చిక్కుల్లో పడే అవకాశం వుండదు. పైగా ఆరోగ్యవంతంగా, నిత్యం ఉల్లాసంగా - ఉత్సాహంగా జీవితాన్ని గడపవచ్చు.
సాధారణంగా వాస్తుశాస్త్రాలు తెలిసివారు ఎవరైనా... ఇంటి నిర్మాణం ఎదురుగా వున్న రోడ్డు కంటే కొంచెం ఎత్తులోనే నిర్మిస్తారు. ఇలా కట్టడం వల్ల వర్షం పడినప్పుడు నీళ్లు లోపలికి రావు. అంతేకాదు.. మనల్ని నిరంతరం ఆరోగ్యంగా వుంచే స్వచ్ఛమైన గాలి, వెలుతురు మెరుగ్గా ఇళ్లల్లోని ప్రవేశిస్తాయి.
వాస్తుశాస్త్రాల్లో ఇళ్లు నిర్మాణం ఎలా వుండాలి..? ఇంట్లో పూజగదులు ఎలా వుండాలి..? ఇళ్లు అభిముఖం ఎలా వుంటే శ్రేయస్కరం..? ఇంటిలోపల మెట్లు ఎలా వుండాలి..? ఇంట్లో వున్న గదులు ఎలా నిర్మించాలి..? అన్నవి మాత్రమే కాకుండా... గాలికి, వెలుతురుకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా తెలుసుకోవలసి వుంది.
ఇళ్లు నిర్మాణం చేపట్టినవారు వాస్తుశాస్త్రాల ప్రకారం కిటికీలను నిర్మించుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే.. మన ఆరోగ్యానికి కావలసిన గాలి, వెలుతురు వీటినుంచే అందుతుంది. చెక్క ఫ్రేముకు అద్దాలు వున్న కిటికీలను నిర్మించుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే.. వాతావరణ కాలుష్య సమయంలో, అధికంగా వర్షం పడుతున్న సమయంలో కిటికీలను మూసినా.. వెలుతురు లోపలికి వచ్చే అవకాశముంటుంది.
శాస్త్రీయపరంగా ఆలోచించి చూస్తే... కిటికీలు లేని ఇళ్లల్లో ఎక్కువగా వెలుతురు వుండదు. పైగా చాలా వేడిగా వుంటూ.. లోపలి గాలి బయటకు పోనివ్వకుండా, అలాగే లోపలున్న వేడి బయటకు వెళ్లకుండా చిరాకు తెప్పిస్తాయి. ఇలా వుండడం వల్ల ఆరోగ్యసమస్యలు అధికం అవుతాయి. మానసికంగా శాంతిని కూడామనం కోల్పోతాము. ఇంట్లో వున్న గదులు చీకటిగా వుంటాయి.
సహజంగా చెప్పుకోవాలంటే.. ఇంటికి ముఖద్వారం ఎంత ముఖ్యమో.. కిటికీలు కూడా అంతే ముఖ్యం. మన ఇంటి సైజును, గదుల సైజును బట్టి కిటికీల ఏర్పాటు చేసుకోవాలి.
వాస్తుశాస్త్రాల ప్రకారం.. ఒక గది వున్న ఇల్లు అయితే ఒక్క కిటికీ వున్న ఫర్వాలేదు. అలా వుండటం వల్ల ఎటువంటి దోషాలు కూడా వుండవు. ఒకవేళ ఇల్లు నిర్మాణం పెద్దదయితే.. 14 కిటికీలు అవసరం అవుతాయి.
వాస్తుప్రకారం.. ఇంటికి 1 నుంచి 14 వరకు కిటికీలు వుండాలి. కిటికీలో ఏ దిక్కున అయినా వుండవచ్చు. అయితే నైరుతి దిశగా మాత్రం కిటికీలు వుండటం శ్రేయస్కరం కాదు. ఒకవేళ అలా నిర్మించివుంటే.. దాంతో కుటుంబసభ్యులకు, ముఖ్యంగా ఇంటి యజమానులకు తీవ్ర ఆందోళనలు తప్పవు. నడుంనొప్పి, మెడనొప్పి వంటి అనారోగ్యాలు వస్తాయి. ఆర్థికపరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా జరగాల్సిన విషయాలు కూడా సమస్యాత్మకంగా మారిపోతాయి. కీళ్లవాతం వచ్చే అవకాశం కూడా వుంది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more