Homam importance in hindu dharmam

homam importance in hindu dharmam, importance of homam in hindu religion, homan procedure, homam news, homam in hindi religion, methods to do homam, hindu religion, hindu traditions, homam tradition in hindu religion

The importance of homam in hindu religion is linked with planets which can cause problems to humans on the earth and read more

హిందూ సంస్కృతిలో హోమం విశిష్టత

Posted: 03/12/2014 06:24 PM IST
Homam importance in hindu dharmam

పూర్వకాలంలో మహర్షులు నిరంతరం హోమాలను నిర్వహించుకునేవారు. అయితే ఇక్కడ మనం బాగా గమనించివలసిందేమిటంటే... మహర్షులు ఈ హోమాలను తమ కోరికలను తీర్చుకోవడం కోసం కాకుండా, ప్రజల క్షేమం గురించి ఉద్దేశించి చేసినవే! అంటే లోక కళ్యాణం కోసం అన్నమాట!

హోమాలు చాలావరకు మనలో వున్న లోపాలను సవరించడానికి, దోషాలనుండి తప్పించుకోవడానికి చేస్తారు. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి భూమిమీద తక్కువగా వున్నా.. అసమతుల్యతలు ఏర్పడుతాయి. అందుకే ఆయా గ్రహానికి సంబంధించిన మూలికలు, ధన్యాలు, ఇతర వస్తువులతో హోమాలు చేస్తారు. హోమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం గ్రహాలను సవరించడానికే. 

ఈ హోమానికి సంబంధించి జ్యోతిషవేత్తలు మానవాళికి కొన్ని సూచనలు అందిస్తున్నారు. అవేమిటంటే.. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే.. దానికి సంబంధించిన విషయాలలోను, రంగాలలోను, కార్యకలాపాలలోను వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అటువంటి సమయాలలో వారి ఇళ్లలో ఈ హోమాలను నిర్వహించుకునే చక్కటి ఫలితాలు అందుతాయి. 

ఈ హోమాలలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించి రకరకాల మూలికలను ఉపయోగిస్తారు. శనిగ్రహం కోసం శమీ వృక్ష సమిధును, రాహువు కోసం గరిక, సూర్యానుగ్రమం కోసం అర్క సమిధి, కేతు గ్రహ ఉపశాంతి దర్భను ఉపయోగిస్తారు. 

ఆయుర్వేదం ప్రకారం మనం గ్రహిస్తే.. అర్క సమిధి, కుష్టు వ్యాధిని నయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం ఉపయోగించే మోదుగ కూడా వైద్యపరంగా జీర్ణవ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి కలిగి వుంటుంది. గురుగ్రహోపశాంతికి రావి చెట్టును ఉపయోగిస్తారు. ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపడంతో విశిష్టమైందని ఆయుర్వేదంలో పేర్కొనబడి వుంది. 

ఈ విధంగా హోమం చేయడం వల్ల ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి, పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ హోమాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారు మాత్రమే నిర్వహిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Pilli shakunam

    పిల్లి శకునం

    Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more

  • Why we use silk clothes in every occasion

    పట్టుబట్టలే ఎందుకు..?

    Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more

  • What is the benefit with mounvrath

    మౌన వ్రతం ఎందుకు???

    Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more

  • What is the eft fall sign

    బల్లి శకునం

    Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more

  • Some unbelives actually have scientific reasons

    మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

    Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more