my mrs and her family members are hidding my children from me

I want to see my kids welfare asks a father

i want to see my kids welfare asks a father, Marriage system, my mrs and her family members are hidding my children from me, Static siddhareddy, Divorce, legal sugesstions, children, my mrs and her family members, foreign trip

my mrs and her family members are hidding my children from me

నా పిల్లల్ని నాకు చూపించకుండా నరకయాతన పెడుతున్నారు

Posted: 06/03/2015 06:23 PM IST
I want to see my kids welfare asks a father

నా భార్య నా అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లింది. మా ఏడేళ్ల దాంపత్య జీవితంలో ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల పాప వున్నా.. వారిని వారి తల్లిదండ్రుల వద్ద వుంచి.. వెళ్లిపోయింది. నాతో నిత్యం గోడవపడేది. అయినా పిల్లలపై మమకారంతో సర్ధుకుపోయాను. చివరకు వారెక్కడున్నారో కూడా తెలియకుండా చేసి విదేశాలకు వెళ్లిపోయింది. అమె తల్లిదండ్రులు వయోవృద్దులవ్వడం చేత వారి నా పిల్లల బాగోగులు సరిగా చూడలేరు. నా పిల్లల బాధ వర్ణనాతీతం. వాళ్లంతా కలిసి పిల్లల్ని నాకు చూపించకుండా నన్ను నరకయాతనకు గురి చేస్తున్నారు. ఈ తరుణంలో నేను ఏం చేయాలి..?

మీ భార్య మీ అనుమతి లేకుండా మీ పిల్లల్ని తన తలిదండ్రుల సంరక్షణలో ఉంచి, విదేశాలకు వెళ్లిపోవడం, తన అడ్రస్ కూడా మీకు తెలియకుండా రహస్యంగా ఉంచటం చట్ట వ్యతిరేకమే. పిల్లలకు చట్టప్రకారం తండ్రే నేచురల్ గార్డియన్. మైనర్ పిల్లలు తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉండటం సహజం. కానీ ఈ కేసులో మీ భార్య తన బాధ్యతను విస్మరించి పిల్లల సంరక్షణను తీసుకోకపోవడమే గాక తన తలిదండ్రులకు ఇచ్చి వెళ్లిపోవడం చట్ట వ్యతిరేకం. కాబట్టి మీరు మీ పిల్లల కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేయండి. తల్లి మైనర్ పిల్లల సంరక్షణ సరిగా చేయలేకపోతోంది కాబట్టి తండ్రిగా మీకు పిల్లల కస్టడీ పొందే అధికారం, హక్కు న్యాయబద్దంగా దక్కవచ్చు. మీరు నాతో చెప్పినవన్నీ కోర్టులో జడ్జిగారికి కూడా వివరించండి. జడ్జిగారు మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని, మీ పిల్లల సంరక్షణను మీకు తప్పక అప్పగించే అవకాశం ఉంది. మీరు ప్రయత్నించి చూడండి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marriage system  legal sugesstions  Divorce  

Other Articles