Supreme court order on dowry harassment cases

Supreme Court order on dowry harassment cases, dowry harassment cases,

Supreme Court order on dowry harassment cases, dowry harassment cases

వరకట్న వేధింపుల పై సుప్రీం కోర్టు మార్గ దర్శకాలు

Posted: 07/07/2014 07:31 PM IST
Supreme court order on dowry harassment cases

- చట్టాలెన్ని ఉన్నా వరకట్న మరణాల సంఖ్య నానాటికీ అధికమవుతున్నదని ఏటా విడుదలయ్యే నేషనల్ క్రైం రికార్డు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగానికి గురవుతున్నదంటూ సుప్రీంకోర్టు పలు కీలక విషయాల్ని సూచించింది.

- వరకట్నం వేధింపుల కింద కేసు పెట్టగానే యాంత్రికంగా అరెస్టు చేయడం తగదని, ఫిర్యాదు వచ్చాక అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించి, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

- ఈ సందర్భంగా న్యాయ మూర్తులు ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. శిక్షా స్మృతిలోని సెక్షన్ ‘498-ఏ’ భర్తలపై అలిగే భార్యలకు రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతున్నదన్నారు.

- సెక్షన్ 498-ఏ కింద అరెస్టవుతున్నవారిలో కేసుతో ఏమాత్రం సంబంధంలేని భర్త తరఫు బంధువులున్నట్టు అడపా దడపా వార్తలు వస్తుంటాయి. అత్తింటిలో వేధింపులు తాళ లేక, తన కాపురం ఎటూ నిలిచేది కాదని అర్ధమయ్యాక కొందరు మహిళలు ఇలా చేసిన సందర్బాలు లేకపోలేదు.

- ఎలాంటి చట్టమైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టుగానే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతుంది. ఆ చట్టాన్ని ఉపయోగించుకునేవారిలోనూ, అమలుచేసేవారిలోనూ చిత్తశుద్ధి కొరవడినప్పుడు చట్టాలు దుర్వినియోగం అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.  

- అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను సాకుగా చూపి కేసు దర్యాప్తులో, వరకట్న నిందితులను అరెస్టు చేయడంలో పోలీసు అధికారులు జాప్యం చేస్తే...చివరకు బాధిత మహిళలకు న్యాయం లభించకపోతే కేసులు పెట్టడానికి ముందుకొచ్చేవారి సంఖ్య క్రమేపీ తగ్గే ప్రమాదం ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles