పెళ్లి చూపులు రివ్యూ | pelli choopulu movie review

Teluguwishesh పెళ్లి చూపులు పెళ్లి చూపులు pelli choopulu telugu movie review. Product #: 76733 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పెళ్లి చూపులు

  • బ్యానర్  :

    ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్

  • దర్శకుడు  :

    తరుణ్ భాస్కర్

  • నిర్మాత  :

    రాజ్ కందుకూరి, యశ్ రంగినేని

  • సంగీతం  :

    వివేక్ సాగర్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    నగేష్ బానెల్

  • ఎడిటర్  :

    రవితేజ గిరజల

  • నటినటులు  :

    విజయ్ దేవరకొండ, రీతూవర్మ తదితరులు

Pelli Choopulu Movie Review

విడుదల తేది :

2016-07-29

Cinema Story

ప్రశాంత్ (విజయ్ దేవరకొండ), చిత్ర(రీతూ వర్మ) ఇద్దరు పరస్పరం వ్యతిరేక మనస్తత్వాలు ఉన్నవారు. సోమరి జీవితాన్ని గడుపుతూ లైఫ్ లో ఏ లక్ష్యం లేకుండా ఇతరులపై ఆధారడి జీవించేవాడు ప్రశాంత్. చిత్ర ఏమో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తట్టుకుని తాను అనుకున్నది సాధించే యువతి. వీరిద్దరు పెళ్లి చూపుల పుణ్యమాని కలుసుకుంటారు. అయితే ప్రశాంత్ వ్యక్తిత్వం నచ్చని చిత్ర అతనికి నో చెప్పేస్తుంది. 

దీంతో ముందు జీవితంలో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిన ప్రశాంత్, చిత్రతో కలిసి ఫుడ్ ట్రక్ బిజినెస్ పెడతాడు. ఇక అక్కడి నుంచి వారి ప్రయాణం ఎలా సాగింది. ఇష్టం లేకపోయినా చిత్ర అతన్ని ఎందుకు భరిస్తుంది. చివరికి ఇద్దరు ఒకటవుతారా? లేక పెద్దలు కుదిర్చిన వేరే సంబంధాలు చేసుకుంటారా? అన్నదే కథ.

cinima-reviews
పెళ్లి చూపులు

చడీచప్పుడు లేకుండానే షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ లుక్ లోనే ఆసక్తిని క్రియేట్ చేసింది పెళ్లి చూపులు చిత్రం. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ప్రమోషన్ కారణంగా సరిగ్గా రిలీజ్ కు ముందుగా బాగా హైప్ క్రియేట్ చేసుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పెద్ద సినిమాలు తగిలించిన దెబ్బల నుంచి ఈ సినిమా కాస్తైనా రిలీఫ్ ఇచ్చిందా? తెలుసుకోవాలని ఉందా అయితే ఛలో రివ్యూ...

విశ్లేషణ

ఒక సినిమాపై పాజిటివ్ హైప్ క్రియేట్ అయినప్పుడు అందుకు తగ్గట్లుగా కంటెంట్ లేకపోతే ప్రేక్షకుడు నిరాశపడుతుంటాడు. కానీ, ప్రమోషన్లలో చూపించినట్లు తెరకెక్కిస్తే మాత్రం కాస్త సంతృప్తి చెందుతాడు. షార్ట్ ఫిల్మ్స్ తీసే దర్శకుడు తరుణ్ భాస్కర్ సింపుల్ గా ఓ రొమాంటిక్ అండ్ లవ్ కామెడీ డ్రామా గా దీన్ని తెరకెక్కించాడు. కేవలం హీరో హీరోయిన్లే చుట్టూ కథ తిప్పుతూ మధ్యలో మిగతా పాత్రలను జస్ట్ వాడుకుంటూ ఎక్కడా బూతు లేకుండా నీట్ గా తెరకెక్కించాడు. నేటి యువతరం మనసులు ఎలా ఉంటున్నాయి అనేది చూపిస్తూనే ఖాళీగా తిని కూర్చోకుండా లక్ష్య సాధన కోసం కృషి చేయాలంటూ ఓ చిన్న సందేశాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు.

తొలి చిత్రంలో దూద్ కాశీ కుర్రాడిగా మాస్ లుక్ లో కనిపించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు కోసం టోటల్ గా మ్యాన్లీ లుక్ లోకి మారిపోయాడు. లేజీ కుర్రాడిగా అలరిస్తూనే మధ్యలో కాస్త ‘అతి’ కూడా చేశాడు. ఇక రీతూ వర్మ ముక్కుసూటి మనస్తత్వం ఉన్న యువతిగా బాగా చేసింది. కొన్ని సీన్లలో హీరోను కూడా డామినేట్ చేసింది. ప్రధాన కథ వీరిద్దరి చుట్టే నడవటంతో మిగతా పాత్రలకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. కానీ, దర్శకుడు ఆ ఉన్నవారితోనే బాగా మేనేజ్ చేయగలిగాడు. పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవటం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. మొత్తంగా దర్శకుడు అన్ని ఎలిమెంట్స్ను అందిస్తూనే ఎక్కడగా గీత దాటకుండా జాగ్రత్త పడ్డాడు.

సినిమాకు ఇంకో హైలెట్ ఏదైనా ఉందంటే అది సినిమాటోగ్రఫి యే. నగేష్ బెగెల్లా ఛాయాగ్రహణం చూస్తే ఇది అసలు చిన్న సినిమా కాదేమో అన్న అనుమానం కలుగుతుంది. మాములు లోకేషన్లను కూడా కలర్ ఫుల్ గా చూపించాడు. వివేక్ సాగర్ సంగీతం జస్ట్ ఓకే. పరిమిత బడ్జెట్ తో క్వాలిటీ సినిమాను అందించిన నిర్మాతలను అభినందింవచ్చు. రవితేజ ఎడిటింగ్ సరిగ్గా సరిపోయింది. అయితే సెకండాఫ్ లోనే అది కాస్త సాగదీసినట్లు అనిపించక మానదు. టైమింగ్ ఫ్లస్ హ్యుమర్ తో కూడిన సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి.

ఫ్లస్ పాయింట్లు:

హీరో, హీరోయిన్ల యాక్టింగ్

క్లీన్ అండ్ నీట్ గా ఉండే కథ

నగేష్ సినిమాటోగ్రఫీ

తరుణ్ భాస్కర్ డైరక్షన్

 

 


మైనస్ పాయింట్లు

సెకంఢాఫ్ సాగదీత

పాటలు


తీర్పు

కొత్త తరహా టేకింగ్ తో వచ్చే సినిమాలు సక్సెస్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అవి బాగా తగ్గిపోయాయి. అన్ని మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చేస్తున్నాయి. అలాంటి సమయంలో తన తొలి చిత్రంతోనే ప్రేక్షకులకు ఓ మంచి సినిమాను అందించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. భారీ హంగులకు పోకుండా సింపుల్ గా చిన్నతరహా నటులతోనే, మంచి కథతో ముందుకు వచ్చాడు. అయితే కీలకమైన ద్వితీయార్థంలో కాస్త తడబడినప్పటికీ క్లైమాక్స్ కి ముందు నుంచి మళ్లీ ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. పెద్ద గొప్ప చిత్రం అని చెప్పలేకపోవచ్చు గానీ, ఈ మధ్య వచ్చిన చిత్రాలతో పోలిస్తే ఫ్రెష్ ఫీలింగ్ మాత్రం కలుగజేస్తుంది.

చివరగా... యూత్ తోపాటు ఫ్యామిలీస్ ను ఆకట్టుకునే చిత్రాలు చాలా అరుదు. పెళ్లి చూపులు ఆ కోవలోనిదే.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.