Sultan Movie Review

Teluguwishesh సుల్తాన్ సుల్తాన్ Salman Khan Sultan Movie Review. Product #: 76183 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సుల్తాన్

  • బ్యానర్  :

    యశ్ రాజ్ ఫిలింస్

  • దర్శకుడు  :

    అలీ అబ్బాస్ జఫర్

  • నిర్మాత  :

    ఆదిత్య చోప్రా

  • సంగీతం  :

    విశాల్-శేఖర్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    ఆర్తుర్ జురౌస్కీ

  • ఎడిటర్  :

    రమేశ్వర్ ఎస్ భగత్

  • నటినటులు  :

    సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ, రణ్ దీప్ హుడా, అమిత్ సాద్ తదితరులు

Salman Khan Sultan Movie Review

విడుదల తేది :

2016-07-06

Cinema Story

హర్యానాకు చెందిన జాట్ వ్యక్తి సుల్తాన్ అలీ ఖాన్(సల్మాన్ ఖాన్) మంచి రెజ్లర్ కానీ పని పాట లేకుండా ఉంటాడు. ఇంతలో ఆర్ఫా(అనుష్క శర్మ) ను తోలిచూపులోనే ప్రేమించి కష్టపడి ఆమెను మెప్పించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు ఇతని జీవితం సాఫీగానే సాగుతుంది. ఇంతలోనే అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అదే సమయంలో వృత్తిపరంగానూ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

రానురాను పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారడంతో మరోసారి మల్లయుద్ధంలో పాల్గొని.. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సుల్తాన్ నిర్ణయించుకుంటాడు. కానీ.. 40 ఏళ్లకుపైగా వయసు ఉండడంతో ఇతనికి ఎవరూ సహకరించరు. అప్పుడు సుల్తాన్ ఏం చేశాడు? తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం పడ్డ కష్టాలేంటి? ఇతనికి భార్య ఎలా సహాయం చేస్తుంది? చివరి పోటీలో గెలుస్తాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

cinima-reviews
సుల్తాన్

బాలీవుడ్ లో పైసా వసూలు హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరు సల్మాన్ ఖాన్. ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి క్లాస్ చిత్రంతో కూడా కలెక్షన్లు రాబట్టిన సత్తా ఒక్క సల్లూ బాయ్ సొంతం. ఇక ఇప్పుడు మల్లయోధుడిగా రాబోతున్న చిత్రం సుల్తాన్. రంజాన్ కి వచ్చిన సల్మాన్ ఏ చిత్రమైనా బ్లాక్ బస్టర్ గా నిలవటం తెలిసిందే. మరీ ఆ సెంటిమెంట్ ను సుల్తాన్ కొనసాగించాడా? కలెక్షన్లతో మరోసారి శాసించబోతున్నాడా? ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది.

ఫ్లస్ పాయింట్లు:

ఓ వ్యక్తికి సంబంధించిన కధను... అది కూడా ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందించడం, పైగా సల్మాన్ లాంటి స్టార్ హీరోతో చేయండటం దర్శకుడికి కత్తి మీద సాములాంటిదే. కానీ, ఈ ప్రయోగంలో అబ్బాస్ అలీ గ్రాండ్ సక్సెస్ అయ్యాడు.

కుస్తీ వీరుడిగా సల్మాన్ ఖాన్ నటన అద్భుతం. ఒక రకంగా ఇది సల్మాన్ వన్ మాన్ షోనే. మల్లయోధుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్స్, కామెడీ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక అతనికి జోడిగా నటించిన అనుష్క కూడా బాగా అలరించింది. రెజ్లర్ పాత్ర కోసం ఆమె పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఇక లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. అదే హైలెట్ గా నిలిచింది కూడా. రణ్ దీప్ హుడా కూడా బాగా చేశాడు. మిగతావారంతా ఓకే.

మైనస్ పాయింట్లు:

పూర్తిస్థాయి ఎమోషన్స్ తో కూడుకున్న సెకండాఫ్ కాసేపు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. మధ్య లో వచ్చే పాటలు కూడా కాస్త చికాకు పెట్టిస్తాయి. అయితే సల్మాన్ భీభత్సమైన నటన ముందు ఆ మైనస్ లు కనుమరగయిపోతాయి.

సాంకేతికవర్గం పనితీరు:

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే... చిత్రానికి స్క్రీన్ ప్లే ఎంత హైలెట్ కథకు అనుగుణంగా అందించిన డైలాగులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. పాటలు, అవి చిత్రీకరించిన లోకేషన్లు అధ్బుతం. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రపీ, ఎడిటింగ్ అన్ని కుదిరాయి. అబ్బాస్ అలీ జప్ఫర్ అందిచిన కథ... ఆదిత్య చోప్రా స్క్రీన్ ప్లే... దాన్ని డీల్ చేసిన విధానం బాగుంది.

భావోద్వేగాలతో కూడిన కథ, దానికి తగ్గట్లు సాగే స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కంటెంట్ ను స్టార్ హీరోతో తెరకెక్కించిన దర్శకుడి ప్రతిభను అభినందించాల్సిందే. చివరగా... పైసా వసూల్ పహిల్వాన్ ఈ సుల్తాన్... డోంట్ మిస్ ఇట్.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.