UPCOMING Movies

మనం

అక్కినేని ఫ్యామిలీ త్రయం కలిసి నటించిన ‘మనం ’ సినిమా. తన సొంత పతాకమైన అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు. విక్రమ్ కుమార్ ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వాన్ని అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.