HIV or contractor behind vijay sai suicide..? విజయ్ కు హెచ్ఐవి..? అత్మహత్య వెనుక బడా కాంట్రాక్టర్..?

Hiv or contractor behind vijay sai suicide

tollywood comedian vijay sai, comedian vijay sai, vijay sai contractor, vijay sai vanita, vijay sai threatened, vijay sai autopsy, vijay sai complaint, vijay sai shashidar, vijay sai rowdies, vijay sai vanita car, tollywood vijay sai, tollywood comedian vijay, comedian vijay, ammayelu abbayelu, vijay, comedian vijay sai, vijay death, comedian vijay sai death

police are conducting autopsy to tollywood young comedian vijay sai dead body on the basis of his wife vanita complaint, and also to take action on vijay's selfie and the police complaint given on 9 december.

విజయ్ కు హెచ్ఐవి..? అత్మహత్య వెనుక బడా కాంట్రాక్టర్..?

Posted: 12/12/2017 11:59 AM IST
Hiv or contractor behind vijay sai suicide

టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి.. ఆత్మహత్య అనేక ట్విస్టులు తిరుగుతోంది. చిత్రసీమలో అవకాశాలు లేక ఆయన అత్మహత్య చేసుకున్నాడని నిన్న ఉదయం వచ్చిన వార్తలు నిజంకాదని తేలిపోయింది. ఆయన ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కూడా లభించాయని సీనివర్గాలు చెప్పడంతో ఇక తెరపైకి ఆయనకు అమ్మాయిలతో సంబంధాలు వున్నాయని వారికే పూర్తిగా డబ్బును ధారపోస్తుంటాడని అతని భార్య అరోపించింది. అంతేకాదు ఏకంగా విజయ్ సాయికి హెచ్ఐవీ కూడా సోకిందని అమె పోలీసుల ఎదుట అనుమానాలను వ్యక్తం చేసింది.

దీంతో పాటు తండ్రితో అస్తి విషయాల్లో కూడా వివాదాలు వున్నాయని అరోపణలు చేసింది. దీంతో పోలీసులు అయన మృతదేహానికి ఈ కోణంలోనూ పోస్టుమార్టం చేయిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు పాల్పడే ముందు రికార్డు చేసిన సెల్పీ వీడియోను ఆయన మరణ వాంగ్మూలంగా పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్న పోలీసులు.. అంతకన్న ముందు వనిత చేస్తున్న అరోపణల్లో నిజానిజాలెంతో కూడా తెలుసుకోవాల్సిన అవసరముందని అంటున్నారు. ప్రాథమికంగా విజయ్ ఆత్మహత్యకు పాల్పడినా.. కేసు విచారణ, అతని మరణానికి పరోక్షంగా కారణమైన వాళ్లు ఎవరన్నదానిపై విషయాలను తెలుసుకోవా్లసి వుందని అన్నారు.

విజయ్ సాయి అత్మహత్య వెనుక బడా కాంట్రాక్టర్..?

విజయ్ సాయి భార్య వనితతో ఏర్పడిన కుటుంబ కలహాలే కారణమని ఆయన తన సెల్పీ వీడియోలో రికార్డు చేయడం, దాంతో పాటు శశిధర్ అనే వ్యక్తితో పాటు విడాకుల కోసం వనిత తరపున వాదిస్తున్న న్యాయవాదికి కూడా ప్రమేయముందని స్వయంగా విజయ్ సాయి తన రికార్డు చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ సాయి తల్లిదండ్రులు కూడా వనితపై పలు అరోపణలు చేశారు. తమ కొడుకు నుంచి విడిపోయి వేరుగా వుంటున్నా మూడేళ్లుగా డబ్బు, బంగారం కోసం ఆయనను వేధించిందని అరోపించారు.

మూడు రోజుల కిందట అనగా ఈ నెల 9న విజయ్ సాయి అత్మహత్యకు సరిగ్గా ముందు రోజున రాత్రి తొమ్మిది గంటలకు నలుగురు రౌడీలను వెంటబెట్టుకుని వచ్చిన వనిత తన అపార్టుమెంటె్ వాచ్ మెన్ భీమన్నను బెదిరించి, తన ఇంట్లోకి ప్రవేశించిన తనపై దాడి చేసి ఏపి 09 సిక్యూ 6567 నెంబరుగల తన కారును బలవంతంగా.. తన ఇంట్లోంచి తీసుకెళ్లిందని కూడా అరోపించడంతో పాటు అదే రోజున విజయ్ సాయి పోలిస్ స్టేషన్ కు వెళ్లి మరీ ఫిర్యాదు చేశాడని కూడా వారు అరోపించారు. కాగా అసలు బాధితురాలిని తానేనని అతని భార్య వనితారెడ్డి అరోపించడం కొసమెరుపు.

vijay suicide

కానీ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజయ్ చెప్పిన విషయాలు ఇప్పడు కేసులో కీలకంగా మారాయి. భార్య వనిత రెడ్డితోపాటు శశిధర్, విడాకుల లాయర్ ఒత్తిళ్లు తనను వేధిస్తున్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. అసలు విజయ్ చెప్పిన ఆ శశిధర్ ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బడా కాంట్రాక్టర్లలోని ఓ సంస్థకు ఈయన డైరెక్టరట. అతడి గుప్పిట్లోనే వనితా రెడ్డి ఉందని ప్రచారం సాగుతోంది.

vijay sai suicide
సదరు కాంట్రాక్టర్ సంస్థ ఆషామాషీ కాదని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓ ప్రాజెక్టులో దీనికి కొన్ని ప్యాకేజీలు కేటాయించారని గుసగుసలాడు కుంటున్నారు. దీంతో ఈ కేసును డీల్ చేయడానికి పోలీసులు తటపటాయిస్తున్నారట. ఈ వ్యవహారం ఉన్నతస్థాయికి వెళ్లడంతో ఆ బడా కాంట్రాక్టర్ ను కాపాడేందుకు ప్రముఖలంతా రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విజయ్ సాయి మరణానికి కారణమం ఎవరై వుంటారు..? ఏమై వుంటుందన్న విషయం.. తేలుతుందా..? లేక కాశీకి చేరుతుందా.. అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comedian  vijay sai  suicide  contractor  vanita  shashidar  yousufguda  tollywood  crime  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more