Mahesh Movie Drops from Summer Race | మహేష్ ఎటు కదిలినా చిక్కులే!

Mahesh babu drop from summer race

Mahesh Babu, Bharat Anu Nenu Movie, Bharat Anu Nenu Prepone, Bharat Anu Nenu Release Date, Bharat Anu Nenu Movie Rajinikanth 2.O, Rajinikanth 2.O Naa Peru Surya

Mahesh Babu Bharat Anu Nenu Movie Makers plans to prepone release date. Rajinikanth 2.O, Allu Arjun Naa Peru Surra release on Same Month. So, Mahesh movie may release two weeks before.

భరత్ అను నేను రిలీజ్ డేట్ మారుతోందా?

Posted: 12/05/2017 11:34 AM IST
Mahesh babu drop from summer race

మహేష్ బాబు 'భరత్ అను నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' లతో రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.O చిత్రాలు ఒకేసారి పోటీ పడబోతున్నాయన్న వార్త గత కొంత కాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీటి విషయమై చర్చ కూడా జరుగుతోంది. మహేష్, బన్నీ ఒకేరోజు రావాలనుకోవటం.. పైగా రజనీది భారీ బడ్జెట్ చిత్రం కావటంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే మహేష్ చిత్ర మేకర్లు ఇప్పుడు ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. కలెక్షన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న సత్యాన్ని గమనించిన కొరటాల శివ టీమ్, పోటీ నుంచి తప్పుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. 'భరత్ అను నేను' చిత్రాన్ని కనీసం రెండు వారాల ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారంట. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అంటే ముందుగా అనుకున్న ఏప్రిల్ 27న కాకుండా, 13వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై భరత్ అను నేను-నా పేరు సూర్య చిత్రాల నిర్మాతలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నారని కూడా తెలుస్తోంది. 2.O మేకర్లు ఏప్రిల్ లోనే రిలీజ్ ఖాయమని ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటికీ.. తేదీని మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆ చిత్రం అటు ఇటు అయితే సూపర్ స్టార్ వర్సెస్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more