Rangasthalam Postponed Due to PSPK 25 | చెర్రీ త్యాగం.. మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

Rangasthalam release postponed

Rangasthalam, PSPK 25, Rangasthalam Release Date, Rangasthalam Postpone, Rangasthalam PSPK 25, Ram Charan Pawan Kalyan, Agnatavasi PSPK 25, Agnatavasi Rangasthalam

Ram Charan Postponed Rangasthalam to avoid clash with PSPK 25.

పవన్ సినిమా కోసమే రంగం స్థలం వాయిదా

Posted: 11/15/2017 03:55 PM IST
Rangasthalam release postponed

వాస్తవానికి 'రంగస్థలం' చిత్రాన్ని సంక్రాంతికి సిద్ధం చేయాలని నిర్మాతలు షూటింగ్ తొలి రోజు నుంచే భావించారు. ఈ మేరకు డిసెంబర్ మొదటి వారానికే తొలి కాపీని సిద్ధం చేసి ప్రమోషన్ పనులు ప్రారంభించాలని భావించారు. సరిగ్గా సంక్రాంతి సీజన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, రామ్ చరణ్ 'రంగస్థలం' విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. 

తన బాబాయ్ చిత్రం కూడా విడుదల అవుతుండటంతో, పోటీ ఎందుకని భావించి ఫిబ్రవరి చివరి వారానికి చిత్రం విడుదలను వాయిదా వేసుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడని సినీ ఇండస్ట్రీ సమాచారం. ఈ చిత్రంలో రాంచరణ్, గుబురు గడ్డంతో న్యూలుక్ లో కనిపించనున్నాడు. ఇక ఇందులో చరణ్ బధిరుడిగా కనిపిస్తాడని కూడా మరో వార్త హల్ చల్ చేస్తోంది. చిత్ర రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, 'రంగస్థలం' షూటింగ్ కూడా దాదాపు ముగింపు దశకు రావడంతో, ఫిబ్రవరి వరకూ 'సైరా' నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకోవాలని చరణ్ భావిస్తున్నాడట. ఇక బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగవని తెలుస్తుండటంతో మెగా అభిమానుల్లో కూడా ఆనందం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangasthalam  Pawan Kalyan  Ram Charan  PSPK 25  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more