Pawan Kalyan gives nod for Hit Producer

Dil raju conditions for pawan movie

Dil Raju, Pawan Kalyan, Dil Raju Pawan Kalyan, PK Dil Raju, Dil raju Movie Pawan Kalyan, Pawan Kalyan nod for Dil Raju, Raaju Garu with Pawan, Power Star Dil Raju

Pawan Kalyan Ready to work under Dil Raju Banner. If Good Story comes he is ready to work with him.

దిల్ రాజుకు పవన్ ఆఫర్.. కండిషన్స్ అప్లై

Posted: 06/26/2017 06:02 PM IST
Dil raju conditions for pawan movie

ఓవైపు తన పాతికవ సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లో పూర్తి చేసేసి తర్వాత పూర్తిగా రాజకీయాలకే టైం కేటాయించాలనుకుంటున్నాడు అనే వార్త. కాదు అన్న చిరుతో కలిసి ఓ మల్టీ స్టారర్ లో నటించాక అప్పుడు విరామం ఇస్తాడని సుబ్బిరామిరెడ్డి లాంటి వాళ్ల స్టేట్ మెంట్. మరోవైపు అసలు పవర్ స్టార్ తో కలిసి పని చేసేందుకు ఛాన్స్ దొరుకుతుందా? అని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మరికొందరు... ఏది ఏమైనా పవన్ సినిమాల బ్రేక్ మాత్రం ఫ్యాన్స్ కి కాస్త నిరాశే అని చెప్పాలి.

అయితే ఆయనతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్న స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు కల మాత్రం త్వరలో నెరవేరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మిగతా వాళ్లలాగానే తన కోరిక నెరవేరదేమోననే కంగారుతో పవన్ ను కలిశాడట. ఆయనతో సినిమా చేసే సమయం కోసం తాను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాననే విషయం చెప్పాడట. దీంతో రాజుగారి బ్యానర్ లో చేసేందుకు తనకేం అభ్యంతరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే తనకి ఈ టైంలో మంచి కథ కావాలనీ .. అలాంటిదైతేనే తాను చేసేందుకు రెడీ అని పవన్ చెప్పినట్లు సమాచారం. ఇదే అదనుగా భావించిన రాజు .. పవన్ ఇమేజ్ కి తగిన కథ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. . చిన్నా పెద్ద డైరక్టర్ ఎవరైనా సరే మంచి కథతో తన వద్దకు రావాలని ఇప్పటికే దిల్ రాజు పురమాయించినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంచి కథ దొరికితే మాత్రం త్రివిక్రమ్ తర్వాతి సినిమా దిల్ రాజు బ్యానర్ లో అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Pawan Kalyan  Tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more