Baahubali Prabhas to campaign for BJP

Bjp ready to use prabhas craze

BJP Prabhas, Prabhas Raj BJP, Krishnam Raju Prabhas, Prabhas BJP, Prabhas 2019 Elections, Baahubali Prabhas Political Entry, Prabhas Politics, Prabhas Pawan Kalyan, Pawan Kalyan Prabhas

BJP try to cash Baahubali Prabhas Craze in 2019 Elections. But, Prabhas Previously an interview said He was unfit for Politics.

బీజేపీ ఎన్నికల ప్రచారకర్తగా ప్రభాస్??

Posted: 05/16/2017 02:19 PM IST
Bjp ready to use prabhas craze

రాజకీయాలకు, సినిమాలకు అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. కాస్త గుర్తింపు రాగానే వాళ్ల క్రేజ్ ను ఉపయోగించుకొని ఓట్లు దండుకోవాలని పొలిటికల్ పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. బాహుబలి తో ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్టు ఇప్పుడు వార్తలు షికార్లు చేస్తున్నాయి. తద్వారా 2019 ఎన్నికల్లో లాభపడదామన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది.

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీలో చేరి 12,13 లోక్ సభలకు కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆపై 1999 నుంచి 2004 వరకూ వాజ్ పేయి మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ సేవలందించారు. అనంతరం 2009లో హీరో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవలి కాలంలో తిరిగి బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నాడు.

ఆ మధ్య బాహుబలి పస్ట్ పార్ట్ హిట్ తర్వాత కృష్ణంరాజు ప్రభాస్ ను వెంట పెట్టుకుని మరీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పార్ట్ తో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఈ దశలో ఎన్నికల్లో ప్రభాస్ తో ఎన్నికల ప్రచారం చేయిస్తే, గెలుపు ఖాయమవుతుందన్న ధీమాలో పార్టీ ఉందంట. ప్రభాస్ సినిమాల షూటింగులకు ఇబ్బంది కలిగించకుండా ప్రచార షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో పవన్ క్రేజ్ ను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేసిన బీజేపీ, ప్రభాస్ ను మాత్రం నేషనల్ వైడ్ గా తిప్పేయాలని ఫిక్సయినట్లు సమాచారం.

అయితే, తనకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదని, వాటిని అస్సలు సరితూగనని స్వయంగా ప్రభాస్ ఆమధ్యే తేల్చి చెప్పాడు. ఆ లెక్కన ఈ వార్త ఉత్త గాలి వార్తేనని కొందరు అంటుంటే.. ఇప్పటికే కృష్ణంరాజుతో బీజేపీ గ్రౌండ్ వర్క్ ప్రారంభించేసిందని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా మొహమాటస్తుడు, మాటల్లో కాస్త తడబడే డార్లింగ్ ను రాజకీయ కోణంలో వాడుకోవాలనుకోవటం వర్కువట్ అయ్యే పని కాదని పలువురు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali Actor  Prabhas Raj  BJP  2019 Elections  

Other Articles

 • Pawan phone call to star director

  బోయపాటికి పవన్ నుంచి ఫోన్ కాల్?

  Jan 18 | అజ్ఞాతవాసి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైరెక్షన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో మరో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో... Read more

 • Rajamouli multi starrer budget

  రాజమౌళి మల్టీ స్టారర్ బడ్జెట్ లెక్కలు

  Jan 17 | ఎన్టీఆర్ .. రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ మాటేమోగానీ.. రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇద్దరూ ఇద్దరే అని టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే.. బడ్జెట్ కు... Read more

 • Venky role in agnyaathavaasi

  అజ్ఞాతవాసిలో వెంకటేష్ రోల్ ఏంటంటే...

  Jan 11 | పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారనే వార్తలు ఆ మధ్య వచ్చిన సంగతి... Read more

 • Rajasekhar daughter in 2 states remake

  టూ స్టేట్స్ రీమేక్ లో రాజశేఖర్ కూతురు?

  Jan 08 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాని .. హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా ఆమె ఓ తమిళ సినిమా చేయనుందనీ .. ఆ తరువాత... Read more

 • Naa peru surya story concept

  నా పేరు సూర్య.. కథ ఆ చిత్రం నుంచి తీసుకున్నాడా?

  Jan 03 | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ మాములుగా లేదు. సాలిడ్ గా ఉందంటూ టాలీవుడ్ మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. డేరింగ్ కంటెంట్.. అద్బుతమైన డీవోపీతో ఆకట్టుకున్న టీజర్ అంచనాలను పెంచేసింది.... Read more

Today on Telugu Wishesh