ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాకవుతారు | Karan Johar all set to launch Prabhas in Bollywood.

Prabhas bollywood debut fixed

Baahubali Actor, Baahubali Actor Bollywood, Prabhas Bollywood Debut, Prabhas Karan Johar, Karan Johar Rajamouli, Rajamouli Prabhas Bollywood, Rajamouli Bollywood Debut, Rajamouli Karan Johar Movie, Prabhas Bollywood Debut Director, Prabhas Bollywood Director

Baahubali Actor Prabhas To Star In Karan Johar's Hindi Film Directed by Rajamouli.

ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ ఫిక్స్??

Posted: 04/18/2017 01:19 PM IST
Prabhas bollywood debut fixed

పరభాషలపై మన హీరోలు ఇప్పుడిప్పుడే గురి పెట్టేస్తున్నారు. ఇంతకాలం కేవలం డబ్బింగ్ తోనే సరిపెట్టినప్పటికీ ఇక నుంచి స్ట్రెయిట్ మూవీస్ చేసేందుకు సిద్ధమైపోయారు. మహేష్, అల్లు అర్జున్ ఇప్పటికే తమిళ్ లో పాగా వేసేందుకు రెడీ అయిపోయారు కూడా. అయితే బాలీవుడ్ లో మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోల తాకిడి లేదనే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో చిరు, నాగ్, వెంకీ లాంటి వాళ్లు ప్రయోగాలు చేసి మిశ్రమ ఫలితాలను రాబట్టాక మళ్లీ ఆవైపు కన్నెత్తి చూసిన తెలుగు హీరోలు లేరు. ఆ మధ్య జంజీర్ తో రాంచరణ్ దారుణంగా దెబ్బతిన్నాడు. ప్రస్తుతం ఉన్నవారిలో ఒక్క రానా తప్ప ఇంకెవ్వరూ బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నాలు చేయటం లేదు.

మరి బాహుబలితో రేంజ్ పెంచేసుకున్న ప్రభాస్ పరిస్థితి ఏంటి? నిజానికి బాహుబలి కంటే ముందు యాక్షన్ జాక్సన్ లో ఓ బిట్ లో కనిపించిన ప్రభాస్ బాలీవుడ్ హీరో ఆరంగ్రేటంపై గత మూడేళ్లుగా చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. బాహుబలి 2 రిలీజ్ అవుతుండటంతో అక్కడ ప్రమోషన్లో బిజీగా ఉన్న ప్రభాస్ కి మళ్లీ ఇదే ప్రశ్న ఎదురవుతుండగా, సింపుల్ గా నవ్వుతోనే సమాధానం ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ న్యూస్ ఇప్పుడు అక్కడ మీడియాలో బాగా నానుతోంది.

రాజమౌళితో డైరెక్ట్ హిందీ సినిమా చేయించాలన్నది టాప్ మేకర్ కరణ్ జోహార్ ఆలోచన. చాలాసార్లు ఈవెంట్లలో కూడా ఇదే విషయాన్ని కరణ్ స్వయంగా చెప్పాడు. అయితే అదేదో ప్రభాస్ తోనే చేయిస్తే బావుంటుంది కదా అన్న ఓ అంచనాకు వచ్చాడని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఓ మాంచి మాస్ సబ్జెక్ట్ తోనే డార్లింగ్ ను లాంఛ్ చేయించాలని కరణ్ బలంగా ఫిక్సయ్యాడని, ఇందు కోసం రాజమౌళిని కథ ప్రిపేర్ చేయాల్సిందిగా సూచించాడని ఇలా అందులో ఉంది. అంటే కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మూవీకి జక్కన్న డైరక్టర్ కాగా, ప్రభాస్ హీరో అన్న మాట. ఇప్పట్లో సమాధానం లేని ఈ ప్రశ్న ఆచరణలోకి రావాలంటే చాలా సమయమే పట్టొచ్చు. అప్పటిదాకా ఇలా ఊహగానాలతో గడిపేయటమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Karan Johar  Bollywood Debut  Rajamouli  

Other Articles

 • Sridevi re entry with akkineni movie

  నాగ చైతన్యకు అత్తగా శ్రీదేవి?

  Nov 20 | అక్కినేని ఫ్యామిలీలో హీరోల జోరు ఊపందుకుంది. ఓవైపు నాగ్ వర్మ చిత్రం, నానితో మల్టీస్టారర్, మరోవైపు రెండో తనయుడు అఖిల్ హలో చిత్రాలు చేస్తుండగా.. నాగ చైతన్య చందూ మొండేటితో 'సవ్యసాచి' చేస్తోన్న నాగచైతన్య,... Read more

 • Rangasthalam back drop reveal

  రంగస్థలంలో పొలిటికల్ డ్రామా కూడానా?

  Nov 18 | టాలీవుడ్ లో సూపర్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న సుకుమార్ ఇప్పటిదాకా దాదాపు అన్ని జోనర్లను టచ్ చేశాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో తీయబోయే చిత్రం ఎలాంటి జోనర్ అయి ఉంటుందా? అని... Read more

 • Hero vishal prank video goes viral

  హీరో విశాల్ ఐటీ దాడుల వీడియో.. నిజమేనా?

  Nov 16 | నటుడు విశాల్ ఆస్తులపై ఈ మధ్య ఐటీ దాడులు జరిగాయన్న వార్త వినిపించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పన్ను ఎగవేత కారణంగానే స్పెషల్ టీం సభ్యులు విశాల్ ఆస్తులను క్షుణ్ణంగా తనిఖీలు... Read more

 • Rangasthalam release postponed

  పవన్ సినిమా కోసమే రంగం స్థలం వాయిదా

  Nov 15 | వాస్తవానికి 'రంగస్థలం' చిత్రాన్ని సంక్రాంతికి సిద్ధం చేయాలని నిర్మాతలు షూటింగ్ తొలి రోజు నుంచే భావించారు. ఈ మేరకు డిసెంబర్ మొదటి వారానికే తొలి కాపీని సిద్ధం చేసి ప్రమోషన్ పనులు ప్రారంభించాలని భావించారు.... Read more

 • Boyapati next movie almost confirmed

  బోయపాటితో చెర్రీ మూవీ ఖరారైనట్లే!

  Nov 13 | ఊర మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తన తర్వాతి చిత్రంలో ఓ క్లారిటీ ఇచ్చే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ లు పట్టుకుని మెగా కాంపౌండ్ చుట్టూ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంమైంది. అయితే... Read more

Today on Telugu Wishesh