అఖిల్-శ్రియ బ్రేకఫ్ కు సిల్లీ రీజన్ కారణమా..? silly reason behind akhil and shriya break-up..?

Silly reason behind akhil and shriya break up

akkineni akhil, hero akhil, akhil shriya, shriya reddy, akhil shriya engagement, akhil shriya break-up, Akkineni Nagarjuna, akkineni amala, shriya bhupal reddy, tollywood

if the rumours are to be believed which flash on social media, its just a silly reason which lead akhil and shriya bhupal reddy break-up.

అఖిల్-శ్రియ బ్రేకఫ్ కు సిల్లీ రీజన్ కారణమా..?

Posted: 04/12/2017 07:19 PM IST
Silly reason behind akhil and shriya break up

అక్కినేని నటవారసులు జాబితాలో చిన్నవాడు.. నాగార్జున అమల దంపతుల ముద్దులపట్టి.. ఎవరా అంటే చెప్పని వారుండరు. మాటలు కూడా సరిగా రాని వయస్సులో.. బుడిబుడి నడకలు వేస్తున్న ప్రాయంలోనే సిసింద్రి చిత్రం తో నటన అన్నది తమకు వారసత్వంగా సంక్రమించింది కాదు.. తమ రక్తంలోనే వున్నదని రుజువు చేసిన అఖిల్.. తన ప్రేమ విషయంలో మాత్రం వెనక్కు ఎందుకు తగ్గాడు.  నాగచైతన్య కంటే ముందే ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఇక కళ్యాణ గడియలు వచ్చేశాయ్ అన్న తరుణంలో.. ఎందుకు తన ప్రేయసి శ్రియా భూపాల్ రెడ్డితో బ్రేకప్ కార్డు పడింది.

అఖిల్-శ్రియా భూపాల్‌ల బంధానికి బ్రేకప్ కార్డ్ పడిందన్న విషయం తెలిసిన వాళ్లు.. మొదట కొంత అందోళన చెందినా.. తరువాత మాత్రం అప్పుడే అఖిల్ కు పెళ్లేంటీ..? అంటూ సమర్థించుకున్నారట.  బ్రేకప్ కు అసలు కారణం ఏమిటన్న విషయమై ఇరు కుటుంబాలు మౌనంగా వున్నాయి. ఐతే అడుగు ముందుకేసిన సోషల్ మీడియా.. మాత్రం కారణం మాకు తెలుసు అంటోంది. అయితే ఇదే కారణం ఎడబాటుకు కారణమయ్యిందా..? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
 
నిశ్చితార్థం కాగానే వెంటనే పెళ్లి చేసుకోవాలని శ్రియా భూపాల్ ఇంటి తరఫు నుంచే ఒత్తిడి అధికమైందట. ఈ నిర్ణయం అఖిల్ కు కొంత ఇరకాటంలో పెట్టిందట. నటుడిగా తన కెరీర్ ను ప్రూప్ చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుందామని చెప్పినా.. శ్రియ కుటుంబసభ్యులు వినలేదట. కనీసం రెండో చిత్రం రిలీజ్ అయ్య వరకు అగమన్నా అగలేదట. దీంతో సందిగ్ధంలో పడిన అఖిల్ పెళ్లికి వెనకాడడట. పెళ్లి కూతురు తరఫు వారు ఒప్పుకోకపోవడంతో పెళ్లికి సిద్ధమయ్యాడట.

ఇక పెళ్లికి అంతా రెడీ అంటున్న తరుణంలో కూడా అఖిల్ ఈ విషయాన్ని మళ్లీ శ్రియ కుటుంబసభ్యులకు చెప్పాడట. కెరీర్ మంచి స్టార్ట్ తీసుకుంటే తాము బాగుంటామని కూడా చెప్పిచూశాడట. అంతా అనుకున్నాక.. పెళ్లి రోజు కూడా ఫిక్స్ చేసుకున్నాక పెళ్లిని వాయిదా వేద్దామని నిర్ణయానికి ఎలా వస్తామని, శ్రియ కుటుంబసభ్యులు వాదించడంతో ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయబేధాలు పోడచూపి అఖిల్-శ్రియల పెళ్లి ఆగిపోవడానికి కారణమైందని టాక్. అయితే.. ఈ సిల్లీ రీజన్ వారి బ్రేకప్ కు కారణమా అని..? అంటూ ప్రశించేవారు కూడా లేకపోలేరు. ఇక ఈ రూమర్లపై కూడా ఇరు కుటుంబాలు మౌనంగానే వుండటతో అభిమానుల్లో సందేహాలకు తావిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  akhil shriya  engagement  break-up  silly reason  tollywood  

Other Articles

 • Pawan phone call to star director

  బోయపాటికి పవన్ నుంచి ఫోన్ కాల్?

  Jan 18 | అజ్ఞాతవాసి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైరెక్షన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో మరో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో... Read more

 • Rajamouli multi starrer budget

  రాజమౌళి మల్టీ స్టారర్ బడ్జెట్ లెక్కలు

  Jan 17 | ఎన్టీఆర్ .. రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ మాటేమోగానీ.. రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇద్దరూ ఇద్దరే అని టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే.. బడ్జెట్ కు... Read more

 • Venky role in agnyaathavaasi

  అజ్ఞాతవాసిలో వెంకటేష్ రోల్ ఏంటంటే...

  Jan 11 | పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారనే వార్తలు ఆ మధ్య వచ్చిన సంగతి... Read more

 • Rajasekhar daughter in 2 states remake

  టూ స్టేట్స్ రీమేక్ లో రాజశేఖర్ కూతురు?

  Jan 08 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాని .. హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా ఆమె ఓ తమిళ సినిమా చేయనుందనీ .. ఆ తరువాత... Read more

 • Naa peru surya story concept

  నా పేరు సూర్య.. కథ ఆ చిత్రం నుంచి తీసుకున్నాడా?

  Jan 03 | నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ మాములుగా లేదు. సాలిడ్ గా ఉందంటూ టాలీవుడ్ మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. డేరింగ్ కంటెంట్.. అద్బుతమైన డీవోపీతో ఆకట్టుకున్న టీజర్ అంచనాలను పెంచేసింది.... Read more

Today on Telugu Wishesh