మెంటలిస్ట్ గా నాగ్.. మరి సమంత పేషెంటా? | Nagarjuna as Mentalist in Raju Gari Gadhi 2

Nagarjuna role in rg2 revealed

Akkineni Nagarjuna, Nag Mentalist, Raju Gari Gadhi 2 Hero, Raju Gari Gadhi 2 Nag Role, Raju Gari Gadhi 2 Mentalist, Nag Samantha Raju Gari Gadhi 2, Raju Gari Gadhi 2 Roles Reveal, Samantha Raju Gari Gadhi 2, Seerat Kapoor Raju Gari Gadhi 2, Raju Gari Gadhi 2 Ohmkar, Nagarjuna Mentalist

Akkineni Nagarjuna will be playing a mentalist in horror-thriller "Raju Gari Gadhi 2".

రాజుగారి గది సీక్వెల్ నాగ్ రోల్ అదేనా?

Posted: 02/15/2017 04:12 PM IST
Nagarjuna role in rg2 revealed

సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్న సీనియర్ హీరో నాగ్ ఇప్పుడు మరో కొత్త కథతో రాబోతున్నాడు. ఓం నమో వేంకటేశాయ లో హాథీరామ్ పాత్రలో జీవించేసిన నాగ్ నెక్స్ట్ ఓ హర్రర్ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. యాంకర్ కమ్ డైరక్టర్ ఓంకార్ తీయబోతున్న రాజుగారి గది 2 లో ఓ కీ రోల్ పోషించబోతున్నాడని చెప్పుకున్నాం కూడా.

అయితే అది ఓ దెయ్యం పాత్ర అని జస్ట్ గెస్ట్ రోల్ గానే ఉండబోతుందని షూటింగ్ ప్రారంభ సమయంలో వార్తలు వచ్చాయి. దీనిపై అటు నాగ్ కానీ, ఇటు ఓంకార్ గానీ ఏం క్లారిటీ ఇవ్వలేదు. కానీ, చిత్ర యూనిట్ నుంచి ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే.. నాగ్ ఇందులో ఓ వైద్యుడి పాత్రలో కనిపించబోతున్నాడంట. మానసిక వ్యాధితో బాధపడేవారికి కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి క్యారెక్టర్ లో అది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలుస్తోంది. అంటే చంద్రముఖిలో రజనీకాంత్ తరహా పాత్ర అన్నమాట. అంతేకాదు సినిమా కోసం ప్రత్యేకంగా తెప్పించిన ఓ కాస్ట్ లీ బైక్ ను నాగ్ వాడబోతున్నాడంట.  సీరత్ కపూర్ హాట్ ఫోటోలు

మరోవైపు ఈ సీక్వెల్ సీరత్ కపూర్, షకలక శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, సమంత కూడా ఓ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. తొలుత దెయ్యం క్యారెక్టర్ అని పుకారు రేగగా, అది ఉత్త రూమరేనని, ఎమోషనల్ గా సాగే ఓ రోల్ కోసమే సమంతను తీసుకున్నట్లు ఓంకార్ చెప్పాడు కూడా. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీవీపీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raju Gari Gadhi 2  Nagarjuna  Mentalist  Samantha  Ohmkar  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more