బన్నీ, చెర్రీలకు పోటీగా మాస్టర్ ఫ్లాన్? | Sai Dharam Tej plan to become tough competitor.

Vv vinayak to direct sai dharam tej

Supreme Hero Mega Director, Sai Dharam Tej Bala Krishna, Bala Krishna VV Vinayak, Sai Dharam Tej Vinayak, Sai Dharam Tej Allu Arjun Ram Charan

Supreme Hero Sai Dharam Tej is excited about this project as he is eagerly waiting to work with VV Vinayak.

స్టార్ హీరో అయ్యేందుకు సాయి సూపర్ ప్లాన్

Posted: 02/13/2017 12:17 PM IST
Vv vinayak to direct sai dharam tej

ఓ హీరోకు స్టార్ డమ్ రావటం అనేది మాములు విషయం కాదు. దాని వెనుక ఏళ్ల తరబడి కష్టం, కఠోర శ్రమ ఖచ్ఛితంగా ఉండాల్సిందే. ఈ మధ్య వారసులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలు అని చెప్పుకుంటున్నప్పటికీ వారి క్రేజ్, సినిమాలు చేసే బిజినెస్, కలెక్షన్లు ఎలాంటి హీరోకైనా కొలమానంగా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకొచ్చిన రవితేజ, నాని లాంటి వాళ్లకు పాతిక కోట్ల హీరోలుగా మారటానికి చాలా టైమే పట్టింది.

అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఓవైపు వారసత్వం, మరో వైపు ఓన్ టాలెంట్.. పైగా మద్యలో దిల్ రాజు లాంటి స్టార్ ప్రోడ్యూసర్ మూలానో ఏమో కేవలం మూడు నాలుగు సినిమాలతోనే ఓ స్టార్ హీరోగా అవతారం ఎత్తేశాడు. అంతేకాదు సుప్రీం హీరో ట్యాగ్ లైన్ తో పాతిక కోట్ల హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఆ పరిధిని పెంచుకునే పనిలో పడ్డాడంట.

త్వరలోనే స్టార్ దర్శకుడు వివి వినాయక్ తో ఓ సినిమా చేయాలన్న ఫ్లాన్ లో ఉన్నాడంట. నిజానికి ఖైదీ నంబర్ 150 కన్నా ముందే వినాయక్ తేజు కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. వినాయక్ లాంటి దర్శకుడితో ఛాన్సు కావటంతో తాను అప్పటికే కమిట్ అయిన కథలను కూడా సాయి వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడంట. అయితే హఠాత్తుగా ఖైదీ తెర మీదకు రావటంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. ఆపై బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న వినాయక్ హఠాత్తుగా దాని పక్కనపెట్టి సాయి ప్రాజెక్టును ఆచరణలోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాడంట. అదే జరిగితే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవటమే కాదు, ఏకంగా మెగా హీరోలకే టఫ్ కాంపీటీటర్ గా ఈ సుప్రీం హీరో మారతాడనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  VV Vinayak  Bala Krishna  

Other Articles

 • Vijay devarakonda s taxiwala out of summer race

  వేసవి రేసులో ‘టాక్సీవాలా’ వున్నాడా..?

  May 08 | అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యువతలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని నిలుపుకున్న విజయ్ దేవరకొండ.. అదే ఊపుతో మరో సక్సెస్ ను కూడా అందుకోవాలని మాస్ ప్రేక్షకుల్లో చెరగని... Read more

 • Sentiment behind sye raa movie release

  సైరా విడుదలను ప్రభావితం చేస్తున్న సెంటిమెంట్.?

  May 08 | తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంటుకు చాలా ప్రాధాన్యముందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత రెండో సినిమాను భారీ బడ్జట్ తో చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.... Read more

 • Aadi movie in trouble

  ఇబ్బందుల్లో ఆది కొత్త చిత్రం

  Mar 14 | డైలాగ్ కింగ్, నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది కి ప్రారంభం మాత్రమే అనుకూలించిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చేసిన సినిమాలు చేసినట్లు పోవటంతో.. అతనితో సినిమాలు చేసేందుకు మేకర్లు... Read more

 • Shambo shiva shambo sequel in telugu

  శంభో శివ శంభో-2... తీస్తాడా?

  Mar 13 | రవితేజ కెరీర్ లో రీమేక్ లు పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. వీడే, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో చిత్రాలు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నప్పటికీ హిట్లుగా నిలవలేకపోయాయి. అయితే అల్రెడీ బాక్సాఫీస్... Read more

 • Anushka shetty next movie

  అనుష్క నెక్స్ట్.. నో క్లారిటీ!

  Mar 12 | ఓ హీరోకు తన చిత్రం కోసం కలెక్షన్లు రాబట్టడమే కష్టతరంగా మారిన ఈ రోజుల్లో హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి అనుష్క.. తాను సూపర్ స్టార్... Read more

Today on Telugu Wishesh