ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా ఆయనే కరెక్ట్ | Suitable Director For NTR Biopic.

Senior director consider for ntr biopic

NTR K Raghavendra Rao, K Raghavendra Rao NTR Biopic, NTR Biopic, NTR BiopicDirector, NTR Biopic ANR, NTR Biopic Balakrishna, NTR Biopic Nadendla Bhaskar Rao, NTR Biopic Cast and Crew, NTR Biopic Movie, NTR Biopic 2017

Balakrishna COnsider Veteran director K Raghavendra Rao name for His Father NTR's Biopic.

ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు ఎవరంటే...

Posted: 02/09/2017 02:49 PM IST
Senior director consider for ntr biopic

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన నటుడు, స్వర్గీయ నందమూరి తారకరామా రావు బయోపిక్ అనౌన్స్ మెంట్ ఇలా జరిగిందో లేదో.. అప్పుడే వివాదాస్పద అంశాల గురించి చర్చించటం ప్రారంభించారు కొందరు. సీఎం చంద్రబాబు ను ఎలా చూపిస్తారు? లక్ష్మీ పార్వతిని ఏ కోణంలో ప్రజెంట్ చేయబోతున్నారు? అసలు ఎన్టీఆర్ కోణంలోని చీకటి విషయాలు వెలుగులోకి తెచ్చే ధైర్యం చేస్తారా? అన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇక సహవ్యవస్థాపకుడు, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు అయితే సినిమాలో తనను విలన్ గా చూపిస్తే ఎన్టీఆర్ జీవితంలోని సీక్రెట్లను బయటపెడతానంటూ ఓపెన్ గానే చెప్పేశాడు.

ఈ నేపథ్యంలో సినిమాకి కమిట్ అయిన బాలయ్య చాలా జాగ్రత్తగా స్క్రీప్ట్ ను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రాజకీయాల జోలికి పోకుండా కేవలం సినిమాలతోనే సరిపెడితే మంచిందని, ఎలాంటి వివాదాలు చెలరేగవని చెబుతున్నారు కొందరు. ఇక కత్తి మీద సాములాంటి ఈ కథను డీల్ చేసే సత్తా ఎవరికి ఉందన్నదానిపై ఇప్పుడు అసలు డిస్కషన్. ఈ మేరకు దర్శకుడి రేసులో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

అందులో ఒకరు పూరీ జగన్నాథ్. ఇంతవరకు బాలయ్యతో పని చేయని పూరీ అయితే రేర్ కాంబోగా ఉంటుందని, పైగా ఈ జనరేషన్ కి తగ్గట్లు కథను రూపొందించటంలో మంచి పనితనం ఉండటంతో అతనికే అప్పజెప్పేందుకు సిద్ధమైపోయాడని చెప్పుకున్నారు. కానీ, బయోపిక్ అంటే కథను పూర్తిగా స్టడీ చేయాల్సి ఉంటుంది. మూడు నెలలో సినిమాను చాపలా చుట్టేసి పూరీకి అది కుదరని పని.

ఇక మరో దర్శకుడు, ల్యాండ్ మార్క్ చిత్రాన్ని అందించిన క్రిష్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. పూరీ లాంటి పేరే వినిపించినప్పుడు క్రిష్ పేరును ఎందుకు పరిశీలించకూడదని పలువురు చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఓ కమర్షియల్ చిత్రంలా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఎవరైనా సీనియర్ దర్శకుడి చేతిలోనే కథ పడితే బావుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో తెరపైకి ఇప్పుడు అనుహ్యంగా రాఘవేంద్రరావు పేరు వచ్చింది. వెటరన్ దర్శకుడు అయిన రాఘవేంద్రరావు ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరితో సినిమాలు తీసిన అనుభవమే కాదు, లెజెండరీ నటుడిని చాలా క్లోజ్ గా పరిశీలించిన వ్యక్తుల్లో ఒక్కడు. ఆయన ఇమేజ్ ను ఎలా ఎలివేట్ చేయాలో దర్శకేంద్రుడికి బాగా తెలిసి ఉంటుంది. దీనికి తోడు రాఘవేంద్రరావుకు టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఎలాంటి
వివాదాలు లేకుండా సినిమాను సరిగ్గా డీల్ చేయగలిగేది ఆయన ఒక్కడేనన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నమో వేకంటేశాయ రిటైర్ మెంట్ అని ప్రకటించిన రాఘవేంద్రరావు, మరోక సినిమాకు దర్శకత్వం వహించి రిటైర్ అవుతానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ అంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై అధికార ప్రకటన రావాలనే ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR Biopic  Balakrishna  Director  K Raghavendra rao  

Other Articles

 • Cherry plans item number in rangasthalam

  రంగస్థలంలో సోనాక్షి.. మరి చిరు మూవీలో?

  Jun 20 | తన సినిమాలో ఐటెం సాంగ్ లకు సుకుమార్ ఎంత ప్రయారిటీ ఇస్తాడో తెలిసిందే. అయితే నాన్నకు ప్రేమతో లో మాత్రం ఆ ఎలిమెంట్ మిస్ కావటం, చెర్రీ సినిమా విలేజ్ బ్యాగ్రౌండ్ కావటంతో మళ్లీ... Read more

 • Bunny fears for dj movie

  డీజే ఆ విషయంలో బన్నీ భయపడుతున్నాడా?

  Jun 16 | మోస్ట్ ఎంటర్ టైనింగ్ యాక్టర్ గా టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఓ పేరు ముద్ర పడిపోయింది. డాన్సులతోనే కాదు. సింపుల్ యాక్టింగ్, ఫర్ ఫెక్ట్ కామెడీ టైమింగ్, యాక్షన్... Read more

 • Bollywood actress allegations on tapsee

  తాప్సీపై బాలీవుడ్ హీరోయిన్ ఆరోపణలు?

  Jun 15 | బాలీవుడ్ లో ఇప్పుడో హాట్ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. నిర్మాతతో అఫైర్ పెట్టుకున్న కారణంగా తన రోల్ ప్రాధాన్యత తగ్గించేశారంటూ తాప్సీపై మరో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు చేయటం డిస్కషన్ కు... Read more

 • Chiru not okay with ram charan next title

  రంగ స్థలం 1985 ... చిరు ఛాయిస్ కాదా?

  Jun 13 | మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాల విషయంలో చిరు హ్యాండ్ కంపల్సరీ ఉంటుంది. కథ ఎంపిక దగ్గరి నుంచి కాస్టింగ్ సెలక్షన్ దాకా మొత్తం మెగాస్టారే దగ్గరుండి మరీ చూసుకుంటుంటాడు. అదే సమయంలో తన... Read more

 • Kaala karikalan rumours for hype only

  కాలా రూమర్స్.. హైప్ కోసమేనా?

  Jun 06 | కబాలితో తన మార్కెట్ పరిధిని పెంచేసుకున్న రజనీ ముసలి డాన్ గా చేసిన ఓపెనింగ్ మ్యాజిక్ ఇప్పుడప్పుడే మరిచిపోయే ప్రసక్తే కనిపించటం లేదు. అందుకు తన రాబోయే చిత్రాలను కూడా మల్టీ లాంగ్వేజ్ మూవీలుగానే... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno