తెలుగు సినీ పరిశ్రమలో రైటర్లు దర్శకులుగా మారే సంస్కృతి ఇప్పుడు కొనసాగుతోంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సొంత కథను హీరోలకు వినిపించేసి చకచకా పట్టాలెక్కించేస్తున్నారు. అయితే గతంలో మాత్రం దర్శకులు రచయితతో ఓ కథను రెడీ చేయించుకుని, ఆపై నిర్మాతలను ఒప్పించి, హీరోలను మెప్పించి సెట్స్ పైకి వెళ్లే వారు. అలా ఒక సినిమాకు మోక్షం లభించాకే మరో దానికి వెళ్లేశారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.
ఇప్పుడున్న దర్శకులలో కథను సొంతంగా తయారు చేసుకునే సత్తా ఉండటంతోపాటు దాన్ని హ్యండిల్ చేయగల సామర్థ్యం కూడా వారికి ఉంది. దీంతో అన్నింట్లో వేళ్లు దూర్చేస్తూ అన్ని వాళ్లే చూసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో సుకుమార్ ముందుంటే... తర్వాత మారుతి ఉన్నాడు.
బూతు మార్క్ నుంచి ఫ్యామిలీ దర్శకుడిగా మారిపోయిన మారుతికి ఈ మధ్య టైం అస్సలు సరిపోవటం లేదు. ఓవైపు తాను దర్శకత్వం చేసే సినిమాలకి నిర్మాతగానో, లేక డిస్ట్రిబ్యూటర్ గానో వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో ఇతర సినిమాలకి కూడా కథ, స్క్రీన్ ప్లే ను సమకూర్చటంతోపాటు, ప్రోడ్యూసర్ గా చేస్తున్నాడు. తాజాగా త్వరలో విడుదల కాబోతున్న రోజులు మారాయి అనే చిత్రానికి మారుతియే స్క్రీన్ ప్లే. ఆ ధైర్యంతోనే దిల్ రాజు సినిమాకు నిర్మాతగా దీన్ని తెరకెక్కించాడు. ఇలా అన్ని అవతారాల్లో దర్శనమిస్తూ తక్కువ సమయంలోనే ఎక్కువ రాళ్లు వెనకేసుకుని కెరీర్ ను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుంటున్నాడు మారుతి.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more