బ్రహ్మోత్సవం కోసం జనగణమన ఆగుతుందా? | Mahesh babu again working with PVP

Mahesh babu again working with pvp

Mahesh babu again working with PVP, Mahesh babu Janaganamana stopped, Mahesh with vamsi paidipally, Mahesh babu upcoming films, Mahesh babu film updates, Mahesh babu movies, Mahesh babu stills, Mahesh babu next film with vamsi paidipally, Mahesh babu

Mahesh babu again working with PVP: Mahesh babu upcoming film with director Murugados. After murugados film mahesh ready to do Janaganamana with director puri jagannadh.

బ్రహ్మోత్సవం కోసం జనగణమన ఆగుతుందా?

Posted: 05/28/2016 07:33 AM IST
Mahesh babu again working with pvp

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పివిపి బ్యానర్లో నిర్మాత పరమ్.వి.పోట్లూరి నిర్మించిన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుందని భావించిన వారికి నష్టాలపాలు చేసింది. దీంతో నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.

ఈ నష్టాలను భర్తీ చేసేందుకు మహేష్ ఓ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమాను పివిపి బ్యానర్లోనే చేస్తానని నిర్మాత పరమ్.వి.పోట్లూరికి మాటిచ్చినట్లుగా తెలిసింది. దీంతో మహేష్ కు సరిపోయే పర్ఫెక్ట్ కథ కోసం నిర్మాత పరమ్.వి.పోట్లూరి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

తనకు ఇటీవలే ‘ఊపిరి’ సినిమాతో భారీ హిట్టును అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లిని దర్శకుడిగా తీసుకొని మహేష్ సినిమా కోసం కథను సిద్ధం చేయమని పరమ్.వి.పోట్లూరి కోరినట్లుగా సినీవర్గాల సమాచారం. అయితే మురుగదాస్ సినిమా తర్వాత మహేష్ పివిపి బ్యానర్ పై చేస్తాడా లేక పూరీ జగన్నాధ్ తో ‘జనగణమన’ చిత్రం చేస్తాడా అనే విషయంపై క్లారిటీ లేదు.

ఒకవేళ అప్పటివరకు వంశీ పైడిపల్లి సరైన కథతో మహేష్ ను మెప్పిస్తే ‘జనగణమన’ కంటే ముందుగా పివిపి సినిమాయే సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుంది. లేదంటో 2018 చివర్లోనే పివిపికి అవకాశం దొరికే ఛాన్స్ వుంది. మరి ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది. మరికొద్ది రోజుల్లోనే మహేష్-మురుగదాస్ ల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  PVP  Vamsi Paidipally  Janaganamana  Puri Jagannadh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more