rajendra prasad | jayasudha news | murali mohan news | maa elections

Rajendra prasad won maa elections jayasudha murali mohan controversy dasari

rajendra prasad, jayasudha news, murali mohan news, murali mohan updates, rajendra prasad won maa elections, rajendra prasad news, dasari narayana rao news

rajendra prasad won maa elections jayasudha murali mohan controversy dasari : Murali mohan wrong decision defeat jayasudha in maa elections. rajendra prasad won with most votes.

మురళీమోహన్ వల్లే ‘మా’ ఎన్నికల్లో జయసుధ ఓడిందా?

Posted: 04/17/2015 12:04 PM IST
Rajendra prasad won maa elections jayasudha murali mohan controversy dasari

టాలీవుడ్ లో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన ‘మా’ ఎన్నికల్లో ఎట్టకేలకు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరో అభ్యర్థిగా జయసుధ కూడా నిలిచిన విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో గెలవాలని ఎంతో ఆశించిన ఆమెకు చివరకు ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో జయసుధ ఓటమికి మురళీమోహన్ ప్రధాన కారణమని.. ఆయన వల్లే ఈ ‘మా’లో కొన్ని అవకతవకలు కూడా జరిగాయని అనుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఎన్నికల్లో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల్లో రాజేంద్రప్రసాద్ కు మద్దతుగా నాగబాబు నిలవగా.. జయసుధకు మురళీమోహన్ సపోర్ట్ గా నిలిచిన సంగతి విదితమే! ఈ రెండు ప్యానెల్స్ మధ్య మొదట మాటలయుద్ధాలు కూడా జరిగాయి. ఒకరిమీద మరొకరు ఆరోపణలు వెల్లువెత్తుకున్నారు. ముఖ్యంగా మురళీ మోహన్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దాదాపు రెండు దఫాలు ‘మా’ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. ఆర్టిస్టుల కోసం ఎటువంటి పథకాలు అమలు చేయలేదని, అలాగే కొన్ని కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులను తన సొంత వ్యవహారాలకు వినియోగించుకున్నారని ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఇందుకు తగ్గ సాక్ష్యాలు కూడా తన దగ్గర వున్నాయని నటుడు ఓ కల్యాణ్ కూడా తెలుపుతూ కోర్టుకెళ్లడంతో అది కాస్త వివాదమైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కౌంటింగ్ ఆలస్యమైంది కూడా!

అంతేకాదు.. ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ నిలబడతారని అభిప్రాయం వెల్లడించిన వెంటనే మురళీమోహన్ ఆయనకు వ్యతిరేకంగా జయసుధను తీసుకొచ్చారని వాదనలు వినిపించాయి. తాను ఎలాగో ఈ పదవి నుంచి తప్పించుకున్నారు కాబట్టి.. మళ్లీ ఆయనే ఇందులో కొనసాగే అవకాశం లేకపోవడంతో ఆయన ఆ పదవిని జయసుధకు అప్పగించి.. తాను అధికారం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకొచ్చారన్న ఊహాగానాలు వినబడ్డాయి. ఈయనకు సపోర్ట్ గా దాసరి నారాయణరావు కూడా నిలబడ్డారని, వీరిద్దరు కలిసి జయసుధకు మద్దతు పలికారన్న గాసిప్స్ వినిపించాయి. ఇక గతంలో మురళీమోహన్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఆయన మద్దతులో ఎన్నికల్లో నిలబడ్డ జయసుధను ఓడించారని వార్తలొస్తున్నాయి.

అటు.. రాజేంద్రప్రసాద్ కు మద్దతు పలికిన నాగబాబు, మెగాఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ తోనే ఆయన గెలుపొందారని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఈయనకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మెగాఫ్యామిలీకి వ్యతిరేకంగా దాసరి నిలబడి జయసుధకు మద్దతు పలికారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే.. మురళీమోహన్ మొత్తం ప్లాన్ ప్రకారం కొన్ని ప్రణాళికలు రచించి జయసుధను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టారని.. ఆమె గెలిస్తే అధికారం ఈయనకు దక్కుతుందన్న ఆశతోనే ఆయన ఇలా చేశారని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఓడించి.. రాజేంద్రప్రసాద్ ని గెలిపించారని భావిస్తున్నారు. ఏదిఏమైనా.. రాజేంద్రప్రసాద్ గెలుపొందడంపై ఆయన ప్యానెల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  jayasudha news  murali mohan news  maa elections  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more