‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) అధ్యక్ష ఎన్నికలు మార్చి 29వ తేదీన ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే! ఈ అధ్యక్ష పదవికోసం నటకిరిటీ రాజేంద్రప్రసాద్, నటి జయసుధ ఈ ఎన్నికల పోటీలో నిలబడ్డారు. అయితే.. ఈ ఎన్నికలు జరగడానికి ముందు రాజేంద్రప్రసాద్ ప్యానెల్, జయసుధ ప్యానెల్ సభ్యులు ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా నిందలు వేసుకున్నారు. ఎన్నికలు ముగిసేంతవరకు వారిమధ్య మాటలయుద్ధం బాగానే కొనసాగింది. దీంతో ఈ ‘మా ఎన్నికలు’ సినీ ఇండస్ట్రీలో వుండే రెండు వర్గాల మధ్య జరిగిన పోరంటూ సినీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
ఇదిలావుండగా.. ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, జయసుధ ఇద్దరు ముందు నిలిచినా.. వీరి వెనుక మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావులు వున్నారని ప్రస్తుతం పరిశ్రమలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. రాజేంద్రప్రసాద్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నానంటూ ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవి సహకారంతో నాగబాబు మద్దతు తెలిపారని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న దాసరి.. తన పలుకుబడితో మురళీమోహన్ ద్వారా జయసుధను రంగంలోకి దించారని తెలుస్తోంది. ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ ‘మా’ ఎన్నికలు ఇంత హోరాహోరీగా సాగడం వెనుక వీరిద్దరి హస్తం వుందనే వార్తలు మాత్రం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలావుండగా.. ఈ ‘మా’ ఎన్నికలు ముగిసిన అనంతరం మాట్లాడిన మురళీమోహన్.. రాజేంద్రప్రసాద్ ను జయసుధ ఖచ్చితంగా ఓడిస్తుందని హామీ ఇచ్చారు. అయితే.. దాసరి మాత్రం దీనిపై ఏమాత్రం స్పందించలేదు. మరోవైపు రాజేంద్రప్రసాద్ గెలుస్తారని ఆయన ప్యానెల్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి.. వారిద్దరిలో ఎవరు గెలుస్తారోనన్న విషయం తెలియాలంటే.. కోర్టు తీర్ప వెలువడేంతవరకు ఆగాల్సిందే! ఇటీవలే నటుడు ఓ.కల్యాణ్ ఈ ఎన్నికలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే!
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more