Raviteja harish shankar new movie producer dil raju special 26 telugu remake

raviteja news, raviteja shankar movie, special 26 telugu remake, dil raju updates, dil raju gossips, raviteja latest flick, raviteja kick 2 movie, kick 2 movie shooting schedules, harish shankar latest news

raviteja harish shankar new movie producer dil raju special 26 telugu remake : According to the tollywood sources.. Raviteja has given green signal to act in harish shankar directorial movies which will produce by dil raju.

శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ మూడో చిత్రం!

Posted: 02/28/2015 11:40 AM IST
Raviteja harish shankar new movie producer dil raju special 26 telugu remake

మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్-2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు చివరిదశకు చేరుకుంది. ఇందులో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం ‘కిక్-2’ చిత్రీకరణలో బిజీగా వున్న రవితేజ.. ఈ మూవీ పూర్తికాగానే సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ‘బెంగాల్ టైగర్’ షూటింగ్ లో పాల్గొంటాడు. రవితేజ సరసన తమన్నా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. ఇలా ఈ రెండు ప్రాజెక్టులతో బిజీ హీరోగా మారిపోయిన రవితేజ.. అప్పుడే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం చేయనున్నట్లు తెలుస్తుంది.

హిందీలో ఘనవిజయం సాధించిన ‘స్పెషల్ 26’ సినిమా తెలుగులో రీమేక్ లో తాను నటిస్తానని రవితేజ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే! ఓ దొంగలముఠా తాము ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్స్ అంటూ  రాజకీయ, వ్యాపారవేత్తల ఇళ్లలో దాడి చేసి, డబ్బులను దోచుకునే నేపథ్యంలో సాగే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమానే హరీష్ టేకప్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నర్మించే సూచనలు కనిపిస్తున్నాయి.

‘షాక్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు హరీష్ శంకర్.. ఆ తర్వాత మళ్లీ రవితేజతోనే జతకట్టి ‘మిరపకాయ్’తో హిట్ కొట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ రానుంది. కిక్ 2′ షూటింగ్ లో బిజీగా వున్న రవితేజ ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో నటిస్తాడు. వీటి తరువాత ఈ చిత్రం ప్రారంభంకానుంది. అయితే.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడి కావాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja latest news  harish shankar  dil raju  special 26 telugu remake  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more